నా మిత్రుడు ఏదో ఒక రోజు సీఎం అవుతాడు.. పవన్ పై ఎస్ జె సూర్య కామెంట్స్!

July 8, 2024

నా మిత్రుడు ఏదో ఒక రోజు సీఎం అవుతాడు.. పవన్ పై ఎస్ జె సూర్య కామెంట్స్!

ఎస్ జె సూర్య పరిచయం అవసరం లేని పేరు. ఈయన ఇండస్ట్రీలో ఒక దర్శకుడిగా అదే విధంగా నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన ఇటీవల కాలంలో ఎక్కువగా సినిమాలలో నటిస్తూ నటుడిగా గుర్తింపు పొందుతున్నారు. ఇక త్వరలోనే శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన భారతీయుడు2 సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా జూలై 12వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం ఇటీవల హైదరాబాద్ చేరుకొని ఇక్కడ పెద్ద ఎత్తున ఈ సినిమా వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సినిమా సెలబ్రిటీలందరూ పాల్గొని సందడి చేశారు. అయితే ఈ కార్యక్రమంలో ఎస్ జె సూర్య ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు.

తాను గతంలో పవన్ రాజకీయాల గురించి మాట్లాడాను ఎప్పటికైనా తాను రాజకీయాలలో సక్సెస్ అవుతారని చెప్పాను. అప్పుడు చెప్పిన విధంగానే ప్రస్తుతం నా మిత్రుడు ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్నారని తెలిపారు. ఏదో ఒక రోజు ఏపీ సీఎం అవుతారంటూ ఈయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలా నా మిత్రుడు సీఎం కావాలి అంటే అది మీ చేతుల్లోనే ఉంది అంటూ అభిమానులను ఉద్దేశించి సూర్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇలా పవన్ సీఎం అయ్యే ఆ క్షణాల కోసం ఈయన ఎంతో ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ గురించి సూర్య చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక భారతీయుడు సినిమా విషయానికి వస్తే కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో నటుడు సిద్ధార్థ, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్ జె సూర్య వంటి వారందరూ భాగమైన సంగతి తెలిసిందే

Related News

ట్రెండింగ్ వార్తలు