పవన్, ప్రభాస్ అభిమానులకు శుభవార్త చెప్పిన డైరెక్టర్ సుజీత్.. మల్టీ స్టారర్ డ్రీమ్ అంటూ!

May 27, 2024

పవన్, ప్రభాస్ అభిమానులకు శుభవార్త చెప్పిన డైరెక్టర్ సుజీత్.. మల్టీ స్టారర్ డ్రీమ్ అంటూ!

మాములుగా మల్టీ స్టారర్ మూవీస్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా స్టార్ హీరోల మల్టీ స్టారర్ మూవీ అంటే చాలు ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో అలాంటి వార్త ఒకటి వైరల్ గా మారింది. అదేమిటంటే.. పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్‌, గ్లోబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోలుగా మల్టీస్టారర్‌ అనే పదం ఇండస్ట్రీని షేక్‌ చేస్తోంది. ఒక దర్శకుడు ఈ ఇద్దరితో మల్టీస్టారర్‌ చేయాలనే ఆలోచన వ్యక్తం చేసారు. ఆ డైరెక్టర్ మారెవరో కాదు దర్శకుడు సుజీత్‌.

తాజాగా ఆయన తన మనసులో మాట బయటపెట్టాడు. పవన్‌ కళ్యాణ్‌, ప్రభాస్‌లతో మల్టీస్టారర్‌ సినిమా చేయాలని ఉందని అన్నారు. ఈ ఇద్దరితో సినిమా చేయాలనేది తన డ్రీమ్ అని తెలిపారు సుజీత్. ఫ్యాన్స్ కి మెంటల్‌ ఎక్కించే విషయం చెప్పి ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాడు. కాగా తాజాగా భజేవాయువేగం మూవీ ప్రమోషన్‌లో భాగంగా కార్తికేయతో చిట్‌చాట్‌ చేశాడు దర్శకుడు సుజీత్‌. ఈ సందర్భంగా ఓజీ అప్‌డేట్‌ ఇచ్చాడు. అలాగే పవన్‌, ప్రభాస్‌లతో మల్టీ స్టారర్‌ చేయాలనేది తన డ్రీమ్‌ అని తెలిపారు.

ఇందులో నిజానిజాల సంగతి పక్కన పెడితే ఈ వార్త మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వార్త విన్న అభిమానులు నిజమా అంటూ షాక్ అవుతున్నారు. కొందరు ఆనందం వ్యక్తం చేస్తూ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే సుజీత్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఓజి సినిమాను తెరకెక్కిస్తున్నా విషయం తెలిసిందే. అభిమానులు పవన్‌ని ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపిస్తానని తెలిపాడు సుజీత్‌.

Read More: అలా చెస్తే నాన్నకు అస్సలు నచ్చదు… మహేష్ సీక్రెట్ బయట పెట్టిన సితార!

ట్రెండింగ్ వార్తలు