December 18, 2021
అల్లు అర్జున్– సుకుమార్ కాంబినేషన్లో ‘ఆర్య’, ‘ఆర్య 2’ ‘పుష్ప: ది రైజ్’ చిత్రాలు వచ్చాయి. రీసెంట్గా సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో మాట్లాడుతూ ‘ఆర్య 3’ని కన్ఫార్మ్ చేశాడు సుకుమార్. ఎలాగూ మళ్లీ ‘పుష్ప: ది రైజ్’కు సీక్వెల్‌గా ‘పుష్ప: ది రూల్’ ఉండనే ఉంది. మరి..సుకుమార్ ముందుగా ఏ సీక్వెల్‌ను మొదలు పెడతాడో మరి. ప్రజెంట్ ‘పుష్ప’ టాక్ని బట్టి ‘పుష్ప’ సీక్వెల్ డౌటే అంటున్నారు. పైగా సుకుమార్ లాస్ట్ మినిట్ వర్క్ పట్ల మైత్రీమూవీమేకర్స్ వారు కాస్త అసహనం ఫీలయ్యారట. ఓవర్సీస్లో కొన్నిచోట్ల ప్రిమియర్స్ క్యాన్సిల్ కావడం, మలయాళం, కన్నడ వెర్షన్స్ అనుకున్న సమయానికి విడుదల కాకపోవడం వంటి వాటికి దర్శకుడిగా సుకుమారే బాధ్యుడు. దీని కారణంగా ‘పుష్ప’:ది రూల్‌ను మైత్రీ వారు వద్దనుకుంటే వేరే నిర్మాతలు రావాలి. పుష్ప రిజల్ట్‌ని బట్టి వారు వచ్చేలా లేరు. సో…సుకుమార్ నెక్ట్స్ ఫోకస్ చేయాల్సింది తన దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించాల్సిన సినిమా స్క్రిప్ట్ పైనే. మరి..సుకుమార్ తన నెక్ట్స్ప్రాజెక్ట్గా ఏ సినిమాను ఎంచుకుంటాడో చూడాలి.