పవన్ కళ్యాణ్ గెలుపుతో సంచలన నిర్ణయం తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్?

June 6, 2024

పవన్ కళ్యాణ్ గెలుపుతో సంచలన నిర్ణయం తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసినా కూడా కూటమి గెలుపు గురించి మాట్లాడుకుంటున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఏపీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. ప్రస్తుతం ఇదే పేరు ఇందుకు సంబంధించిన పోస్టర్లు ఎక్కడ చూసినా కూడా వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టనున్న విషయం తెలిసిందే. ఇంకా ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టక ముందే జనసేన నాయకులు పండుగలు చేసుకుంటున్నారు.

అయితే ఇలాంటి సమయంలోనే ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్ కూడా వినిపించబోతున్నాడు పవన్. ఇప్పటివరకు సినిమాలపరంగా పవన్ కళ్యాణ్ పవర్ ని చూశారు. కానీ ఇక మీదట పొలిటికల్ పవర్ ను చూడబోతున్నారు. ఈ విషయంలో ఫ్యాన్స్ దిల్ ఖుష్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కు ఆత్మియుల స్పందన కూడా అందరూ చూశారు. అందులో మరీ ముఖ్యంగా పవర్ స్టార్ వెన్నెంటే ఉండే స్నేహితుడు దర్శకుడు త్రివిక్రమ్ పవర్ స్టార్ కు ఎలా విష్ చేస్తారా అని అందరికి ఆలోచన ఉంది. అయితే ఈ విషయంలో త్రివిక్రమ్ ఒక సంచలన నిర్ణయం తీసకున్నాడట.

ప్రస్తుతం ఈ విషయం వైరల్ అవుతోంది. త్వరలోనే పవన్ కళ్యాణ్ జీవిత చరిత్ర పై ఒక సినిమా తెరకెక్కించడానికి త్రివిక్రమ్ రెడీ అవుతున్నాడట. దీనికి సబంధించిన కథను కూడా రాసుకుంటున్నారట త్రివిక్రమ్. ఆయన ఎలా ఇండస్ట్రీలోకి వచ్చాడు? ఇష్టం లేకపోయినా సినిమాలల్లో ఎలా నటించాడు? ఆయనను బాధ పెట్టిన వ్యక్తులు ఎవరు? ఓడిపోయిన సంధర్భంలో ఆయన ఏం చేశాడు? పవన్ పొలిటికల్ ఎంట్రీతో పాటు ఆయన్ను రాజకీయంగా ఇబ్బందిపెట్టింది ఎవరు? ఎలా ముందుకు వెళ్లారు? ఎలా ఆయనను తొక్కేయడానికి ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి. ఇలా ప్రతి ఒక్క అంశాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించడానికి త్రివిక్రమ్ ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read More: నరేంద్ర మోడీకి కొడుకు అకీరాను పరిచయం చేసిన పవన్ కళ్యాణ్.. ఫోటోస్ వైరల్?

Related News

ట్రెండింగ్ వార్తలు