Directorteja:ఈ ఏడాది తన బర్త్ డేకి ‘అసింహ’, ‘విక్రమాదిత్య’ సినిమాలను ప్రకటించారు దర్శకుడు
తేజ. లాస్ట్ బర్త్ డేకి తేజ(Directorteja) కెరీర్‌లోనే బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘చిత్రం’కు సీక్వెల్‌గా ‘
చిత్రం 1.1’ అనౌన్స్ మెంట్ వచ్చింది. ఈ సీక్వెల్ కిల్ అయినట్లుంది. అంతకుముందు బర్త్ డేకి ‘రాక్షసరాజు రావణాసుర’, ‘అలివేలుమంగ వెంకట రమణ’ సినిమాలను అనౌన్స్ చేశాడు దర్శకుడు. ‘చిత్రం 1.1’, ‘రాక్షసరాజు రావణాసుర’, ‘అలివేలుమంగ వెంకట రమణ’ సినిమాలపై మరో అప్‌డేట్ ఇప్పటివరకు రాలేదు.
director teja announced chitram 1.1
రాక్షసరాజు రావణాసురలో రానా, అలివేలుమంగ వెంకటరమణ చిత్రంలో గోపీచంద్ హీరోలుగా నటిస్తారనే వార్తలు అప్పట్లో వచ్చాయి. కానీ ఈవార్తలు నిజం కాలేదు. ‘చిత్రం 1.1’తో దాదాపు 45మంది కొత్తవారిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నట్లుగా చెప్పారు తేజ. కానీ ఈ 45మంది ఎమైయ్యారో తెలియదు. తేజ కేవలం సినిమాలకే పరిమితం కాలేదు.
rakshasharaju ravanasura
లాక్‌డౌన్ సమయంలో ఓ వెబ్‌సిరీస్‌ను టేకప్ చేశారు. ఆ సమయంలోనే తేజకు కరోనా వచ్చింది. ఈ వెబ్‌సిరీస్ కూడా ఏమైందో తెలియదు. ఈ వెబ్‌సిరీస్‌ను గురించిన ప్రకటనైతే రాలేదు. వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ లేదూ! మరి..కనీసం ‘అసింహ’, ‘విక్రమాదిత్య’ చిత్రాలు అయిన సిల్వర్‌స్క్రీన్‌పైకి వస్తాయా? లెట్స్ వెయిట్ అండ్ సీ.Readmore
Samantha Ruth Prabhu: శకుంతలగా సమంత