హీరోయిన్‌ను ముద్దు పెట్టుకునే అవ‌కాశం వ‌స్తే హీరోగా న‌టిస్తానన్న యువ నిర్మాత‌.

February 4, 2022

హీరోయిన్‌ను ముద్దు పెట్టుకునే అవ‌కాశం వ‌స్తే హీరోగా న‌టిస్తానన్న యువ నిర్మాత‌.

DJ TILLU: సిద్ధు జొన్నలగడ్డ – నేహా శెట్టి ప్రధాన పాత్రల్లో విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డీజే టిల్లు’(DJ TILLU). ఈ మూవీ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో నిర్మాత నాగవంశీ పలు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. ‘భీమ్లా నాయక్’ విడుదల గురించి ప్రశ్నించగా.. ”మొన్న పోస్టర్స్ లో చెప్పాం కదా.. ఈ నెల 25 లేదా ఏప్రిల్ 1న రిలీజ్ అవుతుందని. మీరు సీఎం జగన్ గారిని అడగాలి.. 50 శాతం ఆక్యుపెన్సీ ఎప్పుడు తీసేస్తే అప్పుడు సినిమా రిలీజ్” అని నాగవంశీ వ్యాఖ్యానించారు. అంతే కాకుండా ‘డీజే టిల్లు’ నాగవంశీ బయోపిక్ అయితే కాదు కదా? ఎందుకంటే క్యారక్టరైజేషన్ అలానే కనిపిస్తుంది అని ఓ విలేఖరి ప్ర‌శ్నించాడు. దీనికి నాగవంశీ స్పందిస్తూ ”పర్లేదు.. ఇంత అందమైన అమ్మాయిని ముద్దు పెట్టుకునే అవకాశం వస్తే మనం కూడా యాక్ట్ చేస్తాం. తప్పేముంది” అని సిగ్గు పడుతూ జవాబిచ్చారు. హీరోయిన్ నేహా శెట్టి – సిద్ధు జొన్నలగడ్డ కూడా దీనికి నవ్వుతూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇదే ఇంటర్వ్యూలో మరో జర్నలిస్ట్ హీరోయిన్ పుట్టుమచ్చల గురించి హీరోని ప్రశ్నించడం.. దీనిపై నేహా స్పందించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.

Read More: ప‌వ‌న్ సాయిధరమ్‌తేజ్ కాంబినేష‌న్ సెట్‌..డైరెక్ట‌ర్ ఎవ‌రో తెలుసా?https://twitter.com/Vamsivardhan_/status/1488843606450270210?s=20&t=AgqekehXfyPfVTfaoQBHag

Related News

ట్రెండింగ్ వార్తలు