చిరంజీవికి త‌న‌ ముగ్గురు పిల్లలలో ఎవరంటే ఎక్కువ ఇష్టమో తెలుసా?

June 26, 2024

చిరంజీవికి త‌న‌ ముగ్గురు పిల్లలలో ఎవరంటే ఎక్కువ ఇష్టమో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎంతో మంచి క్రేజ్ ఉంది. ఈయన ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు టాలీవుడ్ పెద్దగా కూడా చిరంజీవి వ్యవహరిస్తూ సినీ కార్మికుల బాధ్యతలను తీసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే చిరంజీవికి ముగ్గురు సంతానం కాగా ఇప్పటికే ఇద్దరు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు మరొక కూతురు బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ ఉన్నారు.

చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మితతో పాటు రామ్ చరణ్ ఇండస్ట్రీలో నిర్మాతలు గాను అలాగే నటుడిగా కాస్ట్యూమ్ డిజైనర్ గా కొనసాగుతూ ఉన్నారు. ఇక చిన్న కుమార్తె శ్రీజ మాత్రం ఇతర బిజినెస్లను చేసుకుంటూ ఉన్నారు. ఇక ఈ ముగ్గురిలో చిరంజీవికి ఎవరంటే ఇష్టమనే విషయం గురించి రాంచరణ్ సుస్మిత ఈ ముగ్గురు కూడా వివిధ ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి

ఇక చిరంజీవికి తన చిన్న కుమార్తె శ్రీజ అంటేనే ఇష్టమని సుస్మితతో పాటు రామ్ చరణ్ శ్రీజ కూడా తెలిపారు. ఇక సుస్మిత మాట్లాడుతూ నేను పెద్దదాన్ని కాబట్టి నాకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చేవారు. అమ్మకు చరణ్ అంటే ఇష్టం నాన్నకు శ్రీజ అంటే ఇష్టం అని తెలిపారు.. ఇక శ్రీజ కూడా ఇదే విషయం గురించి మాట్లాడుతూ చిన్నప్పటినుంచి నాన్న నన్నే ఎక్కువగా ప్యాంపర్ చేసేవారు.

ఇలా నేను అడిగినది ఏది కాదనలేదు కాకపోతే చిన్నప్పుడే నాన్న నాకు విషయం చెప్పారు. మనం ఎప్పుడు ఏ స్థాయిలో ఉన్నా కూడా పెద్దవారికి గౌరవం ఇవ్వాలని పెద్దవారితో మాట్లాడేటప్పుడు చాలా మర్యాదగా మాట్లాడాలని తెలిపారు. ఇక మనం మాట్లాడే వ్యక్తి మనకంటే కూడా చాలా పెద్దవారు మంచి పొజిషన్లో ఉంటే వాళ్ళ కాళ్ళకు దండం పెట్టి ఆశీర్వాదాలు తీసుకోవాలని కూడా నాన్న చిన్నప్పుడే మాకు చెప్పారంటూ శ్రీజ ఓ సందర్భంలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read MoreChiranjeevi: ఇంతకంటే నాకు కావాల్సిందేముంది.. టాలెంట్ ఒకరి సొత్తు కాదు: చిరంజీవి

ట్రెండింగ్ వార్తలు