విలన్ పాత్రలకు సునీల్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. ఏకంగా అన్ని కోట్లా?

June 24, 2024

విలన్ పాత్రలకు సునీల్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. ఏకంగా అన్ని కోట్లా?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు నటుడు సునీల్. ఈయన కెరియర్ మొదట్లో కమెడియన్ గా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి తన కామెడీ పంచ్ డైలాగుల ద్వారా ప్రేక్షకులను మెప్పించారు. ఇలా కమెడియన్ గా కొనసాగుతున్న ఈయనకు హీరోగా సినిమా అవకాశాలు వచ్చాయి. రాజమౌళి దర్శకత్వంలో మర్యాద రామన్న సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఇలా ఈ సినిమా ద్వారా హీరోగా మారి మొదటి సక్సెస్ అందుకున్న సునీల్ అనంతరం పలు సినిమాలలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే తదుపరి సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో కొంతకాలం పాటు ఇండస్ట్రీకి విరామం ఇచ్చారు. ఇక తిరిగి కమెడియన్ గా సహాయ పాత్రలలో నటిస్తూ ఉన్నటువంటి సునీల్ ఇటీవల విలన్ పాత్రలలో నటిస్తూ బిజీగా మారిపోయారు.

ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం పుష్ప ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాలో మంగళం శీను పాత్రలో సునీల్ తన నటన విశ్వరూపం చూపించారు. ఇందులో ఈయన విలన్ పాత్రలో నటించారు. మంగళం శీను పాత్ర సునీల్ కెరియర్ కు మరో మైలురాయని చెప్పాలి.

ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సునీల్ ఇతర భాషలలో కూడా సినిమా అవకాశాలను అందుకుంటున్నారు.. ప్రస్తుతం ఈయన రెండు తమిళ సినిమాలతో పాటు మలయాళ సినిమాలలో కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలలో కూడా ఈయన విలన్ గానే నటిస్తున్నారని తెలుస్తోంది. వరుసగా విలన్ పాత్రలలో నటిస్తున్న సునీల్ ఒక్కో సినిమాకు ఏకంగా ఐదు నుంచి ఏడు కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్టు సమాచారం. ఇలా విలన్ పాత్రకు ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదు. ఇక త్వరలో రాబోయే పుష్ప 2 సినిమాలో ఈయన పాత్ర మరింత హైలెట్ గా ఉండబోతుందని తెలుస్తుంది.

Read More: కల్కి ట్రైలర్ పై రియాక్ట్ అయిన నాగార్జున.. అంతా మంచే జరగాలంటూ?

ట్రెండింగ్ వార్తలు