రామ్ చరణ్, ఉపాసన ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

July 8, 2024

రామ్ చరణ్, ఉపాసన ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

RamCharan-UpasanaKonidela: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నటుడు రామ్ చరణ్ ఉపాసన దంపతులకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. ఈ జంట ఎంతోమంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు. ఉపాసన సినిమా ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి కాకపోయినా అదే స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఉపాసన చిన్నప్పటి నుంచి ఎంతో క్రమశిక్షణ కలిగిన అమ్మాయి అంతేకాకుండా ఎంతో మంచి మనస్తత్వం సేవాగుణం అమ్మాయి కావడంతో ఇప్పటికీ తనకు తోచిన విధంగా ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. తన అపోలో హాస్పిటల్స్ తరఫున ఎంతోమందికి ఉచితంగా వైద్యం అందించడమే కాకుండా ఎన్నో వృద్ధాశ్రమాలకు సహాయ సహకారాలు చేస్తుంటారు. అలాగే జంతువులను కూడా దత్తత తీసుకుంటూ వాటి సంరక్షణ చేపట్టారు.

ఈ విధంగా సామాజిక సేవ కార్యక్రమాలలో కూడా ఎంతో చురుగ్గా పాల్గొనే ఉపాసన మరో వైపు భారీ స్థాయిలోనే ఆస్తులను కూడా పెట్టారనే తెలుస్తుంది ఉపాసన రాంచరణ్ దంపతులకు 2500 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు సమాచారం ఇందులో రామ్ చరణ్ 1400 కోట్లకు యజమానికగా ఉపాసన 1100 కోట్ల రూపాయల ఆస్తులను కూడా పెట్టారు.

ఉపాసన అపోలో హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నత పదవిలో ఉన్న ఈమె అక్కడ ఎడిటర్ చీఫ్ గా కూడా పనిచేస్తున్నదట. ఉపాసన ఇంస్టాగ్రామ్ లో సుమారుగా 1100 మిలియన్ల పైగా ఫాలో అవర్స్ కలిగి ఉన్నది. ఇవే కాకుండా పలు రకాల కంపెనీలలో కూడా ఉపాసనకు వాటా ఉన్న నేపథ్యంలో ఈ స్థాయిలో ఆస్తులను కూడ పెట్టారని తెలుస్తుంది. ఏది ఏమైనా ఉపాసన ఈ వయసుకే భారీ స్థాయిలో ఆస్తులను సంపాదించారనే విషయం తెలియడంతో అందరూ ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు

Related News

ట్రెండింగ్ వార్తలు