June 24, 2024
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కృష్ణంరాజు వారసుడుగా అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు ప్రభాస్. ఈశ్వర్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిస్తూ హీరోగా కొనసాగిన ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి సినిమా ద్వారా ఫాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకోవడంతో ప్రభాస్ క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ఇక ఈ సినిమా తర్వాత ఈయన నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ప్రభాస్ త్వరలోనే కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జూన్ 27వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఇక ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి ఇప్పటికే ఇతర రాష్ట్రాలలో ఇతర ప్రాంతాలలో కూడా భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాక గంటల్లోనే టికెట్లు అన్నీ అయిపోతున్నాయి అయితే ఇప్పటివరకు ఏపీలో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కాలేదు. ఇక నేడు టికెట్ల రేట్లు పెంపు విషయంపై స్పష్టత రాబోతుందని టికెట్ల రేట్లు విషయంలో క్లారిటీ వచ్చిన తర్వాత అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ కానున్నాయని తెలుస్తుంది.
ఇదిలా ఉండగా ప్రభాస్ ఇటీవల కాలంలో సినిమాలు మాత్రమే కాకుండా ఇతర హీరోల సినిమాలలో కూడా క్యామియో రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈయన మంచి విష్ణు హీరోగా నటిస్తున్న తన డ్రీం ప్రాజెక్టు కన్నప్ప సినిమాలో శివుడి పాత్రలో ప్రభాస్ నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాలో కాకుండా ఈయన మరొక సినిమాలో కూడా ఇలా గెస్ట్ పాత్రలో నటించారని తెలుస్తోంది.
కన్నప్ప మూవీ కంటే ముందు హిందీలో అజయ్ దేవ్ గణ్, సోనాక్షి సిన్హా హీరో, హీరోయిన్లుగా ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ జాక్సన్ సినిమాలో క్యామియో రోల్ చేసాడు. ఇపుడు చాలా యేళ్ల తర్వాత ‘కన్నప్ప’లో క్యామియో రోల్లో కనిపించనున్నాడు. మరి ప్రభాస్ పాత్ర కన్నప్ప సినిమాకు ఎలా ప్లస్ పాయింట్ అవుతుందో తెలియాల్సి ఉంది.
Read More: బడా నిర్మాత ఆధ్వర్యంలో పవన్ సక్సెస్ సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్!