డబుల్ ఇస్మార్ట్ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతోందా.. పూరి పోస్ట్ వైరల్!

May 11, 2024

డబుల్ ఇస్మార్ట్ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతోందా.. పూరి పోస్ట్ వైరల్!

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని అలాగే డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో డబుల్ ఇస్మార్ట్ సినిమా రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ప్రాజెక్టు పై భారీగా అంచనాల నెలకొన్నాయి.. అంతేకాకుండా ఈ సినిమాపై ఎన్నో రకాల ఊహాగానాలు కూడా వినిపించాయి. ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని, ఫైనాన్షియల్ గా సమస్యలు వచ్చాయని, ఈ సినిమా అట్టకెక్కినట్టే అంటూ రకరకాల వార్తలు వినిపించాయి. కానీ ఈ మూవీ కొత్త షెడ్యూల్ ప్రారంభం అయినట్టుగా ప్రకటించింది.

తాజాగా పూరి కనెక్ట్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి అప్డేట్ వచ్చింది. దిమ్మా కికిరికిరి అంటూ అప్డేట్ ఇచ్చారు. అయితే ఇదేదో ఫస్ట్ సింగిల్ కోసం హింట్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. పూరి జగన్నాథ్ లైగర్ సినిమాతో డీలా పడి ఉన్న సంగతి తెలిసిందే. లైగర్ ఫ్లాప్ అవ్వడంతో విజయ్ జనగణమన సినిమాను అటకెక్కించాడు. ఇక పూరికి విజయ్ ఛాన్స్ ఇవ్వలేదు. విజయ్ ఖుషి సినిమాను చేశాడు. పూరి మాత్రం హీరోని వెతుక్కునే పనిలో పడ్డాడు. చివరకు రామ్‌ని ఎలాగోలా ఒప్పించేశాడు. ఇస్టార్మ్ శంకర్ సినిమాకు సీక్వెల్‌ను ప్లాన్ చేశాడు. డబుల్ ఇస్మార్ట్‌గా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.

ఈ మూవీని ఈ ఏడాది ఆగస్ట్‌లో విడుదల చేస్తామని ఎప్పుడో ప్రకటించారు. కానీ మధ్యలో చడీచప్పుడు లేకుండా పోయింది. ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్‌గా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ కొత్త షెడ్యూల్ ప్రారంభం అయింది. తాజాగా ఈ మూవీ నుంచి అప్డేట్‌ను కూడా వదిలారు. దిమ్మాక్కికిరికిరి అయితాంది.. ఏదో వచ్చేలా ఉంది.. అంటూ డబుల్ ఇస్మార్ట్ నుంచి అప్డేట్ వదిలారు. ఈ పోస్టును బట్టి చూస్తుంటే ఈ సినిమా నుంచి త్వరలోనే ఫస్ట్ సింగిల్ అప్డేట్ వచ్చేలా కనిపిస్తోంది. మరి ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ విడుదల అవుతుందో చూడాలి మరి.

Read More: కల్కి సీజీ వర్క్‌పై అలాంటి పోస్ట్ చేసిన నిర్మాత.. నాగ్ అశ్విన్ రియాక్షన్ ఇదే?

ట్రెండింగ్ వార్తలు