January 3, 2022
Duniya Vijay On Board For #NBK107: నటసింహా నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఎన్ బీ కే 107 పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీని మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. బాలకృష్ణ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
యధార్ధ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు గోపిచంద్ మలినేని. అయితే ఈ సినిమాలో బాలకృష్ణకు సరిపోయే విలన్ కోసం ఎప్పటినుండో అన్వేషిస్తోంది చిత్ర యూనిట్. ఈ రోజు బాలయ్యకు ఢీ కొట్టే పవర్‌ఫుల్ విలన్‌గా కన్నడ నటుడు దునియా విజయ్‌ని తీసుకున్నారు. దునియా విజయ్ తెలుగులో నటిస్తున్న తొలి చిత్రమిదే. అఖండ తరవాత బాలయ్య, క్రాక్ తరవాత.. గోపీచంద్ మలినేని చేస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే దీనిపై భారీ అంచనాలు మొదలయ్యాయి. సంక్రాంతి తరవాత ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతోంది. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రిషి పంజాబీ కెమెరామెన్‌గా పనిచేయబోతున్నారు. ఈ చిత్రానికి జై బాలయ్య అనే టైటిల్ పరిశీలనలో ఉంది.