అదే డేట్ కి వచ్చేస్తున్న పవన్ కళ్యాణ్ ఓజీ.. మరోసారి క్లారిటీ ఇచ్చిన నిర్మాత డివివి దానయ్య!

April 4, 2024

అదే డేట్ కి వచ్చేస్తున్న పవన్ కళ్యాణ్ ఓజీ.. మరోసారి క్లారిటీ ఇచ్చిన నిర్మాత డివివి దానయ్య!

సుజిత్ డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ఓజీ. ఈ సినిమా ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా మరియు మార్షల్ ఆర్ట్స్ నేర్పించే ట్రైనర్ గా కనిపించబోతున్నట్లు సమాచారం. దర్శకుడు సుజిత్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని కావటంతో ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాని తీస్తున్నారు.

ఎప్పటికప్పుడు మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. అయితే ఈ సినిమా ని సెప్టెంబర్ 27వ తారీఖున రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత డివివి దానయ్య ఎప్పుడో ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తూ ఉండటం, 2019 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ సరి అయిన ఫలితాలు పొందకపోయారు.

దాంతో 2024 ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వలన గత ఏడాది డిసెంబర్ నుంచే సినిమా షూటింగ్స్ ఆపేయటం జరిగింది.దీంతో అభిమానులలో తీవ్ర నిరాశ ఎదురయింది. సెప్టెంబర్ 27న సినిమా రిలీజ్ అవుతుందో లేదో అనే ఉత్కంఠత వారిలో ఏర్పడింది. అయితే ఈ మధ్యనే గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా ట్రైలర్ లో పాల్గొన్న నిర్మాత డివివి దానయ్య ప్రేక్షకుల కన్ఫ్యూజన్ ని అర్థం చేసుకొని వారికి ఒక క్లారిటీ ఇచ్చారు.

పవన్ అభిమానులు ఓజీ విడుదల గురించి అరుస్తూ ఉండటంతో సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతుందని, పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టిన అత్తారింటికి దారేది సినిమా కూడా 2013లో ఇదే డేట్ కి రిలీజ్ అయిందని, ఇప్పుడు ఓ జి సినిమాని కూడా అదే డేట్ లో రిలీజ్ చేస్తామని నిర్మాత ఒక క్లారిటీ ఇవ్వటంతో పవన్ అభిమానులు ఆనంద పడుతున్నారు.

Read More: మంజుమ్మళ్ బాయ్స్ తెలుగు వెర్షన్ పెయిడ్ ప్రీమియర్స్ పై.. మైత్రి శశి కామెంట్స్!

ట్రెండింగ్ వార్తలు