ఎన్టీఆర్ సినిమాలో నటించిన ఎలాంటి సంతోషం లేదు: ఈషా రెబ్బా

May 17, 2024

ఎన్టీఆర్ సినిమాలో నటించిన ఎలాంటి సంతోషం లేదు: ఈషా రెబ్బా

త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram) దర్శకత్వంలో ఎన్టీఆర్(NTR) హీరోగా పూజాహెగ్డే(Pooja Hegde) హీరోయిన్ గా వచ్చిన అరవింద సమేత వీరరాఘవ(Aravinda Sametha Veera Raghava)సినిమా మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే ఇక ఈ సినిమాలో కూడా మరొక నటి ఈషా రెబ్బా(Eesha Rebba) కూడా నటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూ సందర్భంగా అరవింద సమేత సినిమా గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా ఈషా రెబ్బా మాట్లాడుతూ.. నాగ వంశి గారు త్రివిక్రమ్ గారు వచ్చి ఈ సినిమా కథ చెప్పారు. ఇందులో ఇద్దరూ హీరోయిన్స్ ఉంటారని చెప్పారు. అయితే నేను మాత్రం మెయిన్ లీడ్ లో చేయాలనుకుని ఈ సినిమా చేయనని చెప్పాను కాకపోతే ఇందులో రెండు ప్రధాన పాత్ర లేనని త్రివిక్రమ్ గారు చెప్పడంతో షూటింగ్ కి ఒక్కరోజు ముందు ఈ సినిమాకి ఓకే చెప్పానని వెల్లడించారు. ఇక ఈ సినిమా షూటింగ్ మొత్తం చాలా హ్యాపీగా జరిగిపోయింది.

ఇక ఈ సినిమా విడుదల చేసే ముందు నన్ను సెకండ్ హీరోయిన్ గా అనౌన్స్ చేస్తామని చెప్పారు. ఇక నేను కూడా అలాగే అనౌన్స్ చేయమని చెప్పాను కానీ అలా చేయను ఒకవేళ అలా చేసి ఉంటే నాకు మరింత ప్లస్ పాయింట్ అయ్యేదని భావించినట్లు తెలిపారు. అయితే ఈ సినిమా విషయంలో నేను మాత్రం హ్యాపీగా లేనని ఈషా రెబ్బా వెల్లడించారు. ఈ సినిమాలో నేను నటించిన కొన్ని కీలకమైన సన్నివేశాలన్నింటిని కూడా ఎడిటింగ్ లో తీసేసారు. అలాగే నాతో ఇంకో సాంగ్ ఉంటుంది అన్నారు, అది కూడా క్యాన్సిల్ అయింది. ఆ సినిమాకు నాకు ఉన్న హ్యాపినెస్ ఒకటే తారక్ తో పనిచేశానన్న సంతోషం తప్ప సినిమా వల్ల నాకు ఎలాంటి సంతోషం కానీ ప్లస్ పాయింట్ కానీ లేదని తెలిపారు.

Read More: సైకిల్ షాప్ లో పంచర్ వేసుకునేవాడు.. అంత మాట అన్నావ్ ఏంటి బన్నీ?

ట్రెండింగ్ వార్తలు