October 24, 2021
ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమాతో మరింత వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నారు. ఎఫ్2లో ఉన్నట్టుగానే విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తమ పాత్రలను పోషిస్తున్నారు. ఇక సునీల్ మాత్రం కొత్తగా ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మీద శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
వెంకటేష్, వరుణ్ తేజ్ యాక్టింగ్, వారి పాత్రను తీర్చిన విధానం ప్రతీ ఒక్కటీ కూడా ప్రేక్షకులకు నవ్వును తెప్పించేలా ఉంటుంది. నటకిరీటీ రాజేంద్ర ప్రసాద్, సునీల్ వంటి వారి వల్ల కామెడీ డోస్ ఇంకా పెరగనుంది.
తమన్నా, మెహరీన్‌లు నవ్వించడమే కాకుండా, తమ అందంతో కట్టిపడేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంకాస్త గ్లామర్‌ను అద్దేందుకు సోనాల్ చౌహాన్ కూడా ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకున్నారు. మూడో హీరోయిన్‌గా ఎఫ్ 3లో సోనాల్ చౌహాన్ కనిపించబోతోన్నారు.
ఎఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్ అవ్వడంతో అందరికీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే సినిమా మీద పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని మేకర్లు ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న సినిమా విడుదల చేయబోతోన్నట్టు అధికారికంగా ప్రకటించారు.
ఎఫ్ 2 సంక్రాంతి బరిలోకి దిగి 2019లో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. కానీ ఎఫ్ 3 మాత్రం ఎలాంటి పండుగ సీజన్‌కు రావడం లేదు. ఈ సినిమాతోనే పండుగ రాబోతోంది. ఇలాంటి చిత్రాలకు ప్రత్యేకంగా పండుగ సీజన్ అవసరం లేదు.
హైద్రాబాద్‌లో గత కొన్ని రోజుల క్రితం ప్రారంభించిన ఈ సుధీర్ఘ షెడ్యూల్‌లో దాదాపు నటీనటులంతా కూడా పాల్గొంటున్నారు.
రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఎఫ్ 3 కోసం సూపర్ హిట్ ఆల్బమ్‌ను రెడీ చేశారు. సాయి శ్రీరామ్ కెమెరామెన్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హర్షిత్ రెడ్డి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు