ఎఫ్‌ 3..మళ్లీ మళ్లీ వాయిదా!

December 14, 2021

ఎఫ్‌ 3..మళ్లీ మళ్లీ వాయిదా!

‘ఎఫ్‌ 2’ క్రేజ్‌తో మొదలైన ‘ఎఫ్‌ 3’ చిత్రానికి విడుదల కష్టాలు తప్పేలా లేవు. 2019 సంక్రాంతి పండక్కి వచ్చి బంపర్‌హిట్‌ కొట్టింది ‘ఎఫ్‌ 2’ . దీంతో ఈ చిత్ర నిర్మాత ‘దిల్‌’ రాజు, దర్శకుడు అనిల్‌ రావిపూడి ‘ఎఫ్‌ 3’కి శ్రీకారం చూట్టారు. ‘ఎఫ్‌ 2’లో నటించిన వెంకటేష్, వరుణ్‌తేజ్, తమన్నా, మెహరీన్‌ లతో పాటుగా కాస్త గ్లామ‌ర్‌, న‌వ్వుల‌ డోస్‌ పెంచాలని ‘ఎఫ్‌ 3’ కోసం సోనాలీ చౌహాన్, సునీల్‌లను కూడ తీసుకున్నారు. ఇదే ఊపులో ‘ఎఫ్‌ 3’ చిత్రాన్ని కూడా సంక్రాంతికే రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేశారు ‘దిల్‌’ రాజు. రిలీజ్‌ డేట్‌ చెప్పలేదు కానీ సంక్రాంతి రేసులో ఎఫ్‌ 3 ఉంటుందని ‘నారప్ప’ ప్రెస్‌మీట్‌లో చెప్పారు వెంకటేశ్‌. అంతే ఎఫ్‌ 3’ సినిమా సంక్రాంతి రేసులోకి వచ్చేసిందని అధికారికంగా ప్రకటించినట్లైంది.

Read more: మిలియన్ డాలర్ క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బాల‌కృష్ణ మాస్ జాత‌ర అఖండ‌

ఆ తర్వాత సంక్రాంతి బరిలో ఆర్‌ఆర్‌ఆర్, రాధేశ్యామ్, భీమ్లానాయక్, బంగార్రాజు, శేఖర్‌ (వీలైతే), సర్కారువారిపాట (ఏప్రిల్‌ 1కి వాయిదా పడింది) నిలిచాయి. అయితే సంక్రాంతికి రిలీజైయ్యే సినిమాల నైజాం డిస్ట్రిబ్యూషన్‌ హక్కులను తీసుకున్న ‘దిల్‌’రాజు తన ఎఫ్‌ 3 సినిమాను సంక్రాంతికే విడుదల చేస్తే బాగోదని (కలెక్షన్‌ షేరై, లాభం తగ్గిపోతుంది) ఫిబ్రవరి 25కి వాయిదా వేయించాడు. కానీ ఇప్పుడు ‘ఎఫ్‌ 3’ సినిమా ఫిబ్రవరి 25న కూడా విడుదలైయ్యే అవకాశాలు లేవు సరిక‌దా కొత్త విడుదల తేదీపై తర్జనభర్జనలు పడుతున్నారు చిత్ర యూనిట్‌. పైగా డిసెంబరు 13న వెంకటేష్‌ బర్త్‌డే సందర్భంగా విడుదలైన ఎఫ్‌ 3 గ్లింప్స్‌ వీడియో, పోస్టర్‌లపై ఎఫ్‌ 3 రిలీజ్‌ డేట్‌ కనిపించనే లేదు. ఇది చాలు ఎఫ్‌ 3 సమ్మర్‌కు వాయిదా పడిందని చెప్ప డానికి.

ట్రెండింగ్ వార్తలు