January 9, 2022
2019 సంక్రాంతి హిట్ ‘ఎఫ్ 2’కు సీక్వెల్‌గా ‘ఎఫ్ 3’ చిత్రం వస్తున్న సంగతి తెలిసిందే. వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, మెహారీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనసూయ, సునీల్ కీలక పాత్రధారులు. అయితే షూటింగ్ కోవిడ్ ప్రోటోకాల్స్‌లో భాగంగా కోవిడ్ పరీక్షలు చేయగా ఈ చిత్రంబృందం లోని దాదాపు 15మందికి కరోనా పాజిటివ్ అని తెలిందంట. దీంతో ఈ సినిమా షూటింగ్‌ను నిలిపివేశారు. అయితే కరోన బారిన పడ్డ ఈ పదిమంది ఎవరు అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఒక ‘దిల్’రాజు నిర్మిస్తున్న ఈ ‘ఎఫ్ 3’ ఏప్రిల్ 29న విడుదల కానుంది. కానీ కోవిడ్ ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఈ సినిమా సరైన సమయానికి విడుదల అవుతుందా? లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.