January 10, 2022
F3 Movie: టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త కరోనా కేసులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కరోనాతో పాటు ఒమ్రికాన్ కేసులు భారీగా వెలుగు చూస్తుండటంతో చిన్న, పెద్ద స్టార్స్ అంతా షూటింగులకు ప్యాకప్ చెబుతున్నారు. అయితే కొంతమంది ఇప్పటికే తమ కాల్షీట్లు ఇవ్వడంతో తగిన జాగ్రత్తలు పాటిస్తూ షూటింగులకు హాజరవుతున్నారు. అందులో భాగంగా గత రెండ్రోజులుగా ఎఫ్-3 షూటింగ్ హైదరాబాద్లో వేసిన ఓ సెట్లో జరుగుతోంది. ముందు జాగ్రత్తల్లో భాగంగా యూనిట్ అందరికీ లొకేషన్‌లోనే కరోనా టెస్టులు నిర్వహించారు…అయితే అందులో దాదాపు 20మందికి పైగా కరోనా పాజిటివ్ అని తేలడంతో ఉన్న ఫళంగా షూటింగును వాయిదా వేసి సెల్ఫ్ ఐసోలేషన్ కి వెళ్లారట చిత్ర యూనిట్.
Read More: పేర్ని నానితో భేటీ వివరాలు తెలిపిన రాంగోపాల్ వర్మమరోవైపు టాలీవుడ్ సెలబ్రెటీలంతా కరోనా బారిన పడుతుండటంతో ఇండస్ట్రీ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ లిస్టులో సూపర్ స్టార్ మహేష్ బాబు, మ్యూజిక్ డైరెక్టర్ థమన్, హీరోయిన్ త్రిష, లక్ష్మీ మంచు, నిర్మాత బండ్ల గణేష్, సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నటి శోభన, మీన, ఇషా చావ్లా వంటి వారున్నారు. వీరంతా ప్రస్తుతం హోం ఐసోలేషన్లో వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నారు.