May 28, 2024
మలయాళ స్టార్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులోనూ ఆయనకు ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులో పుష్ప సినిమాలో భన్వర్ సింగ్ షకావత్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. ఈ సినిమా తర్వాత ఈయన తెలుగులో కూడా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు అనంతరం ఈయన మలయాళంలో నటిస్తున్న ప్రతి ఒక్క సినిమాని కూడా తెలుగులో విడుదల చేస్తున్నారు.
తాజాగా ఈయన నటించిన ఆవేశం అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఫాజిల్ తన అనారోగ్య సమస్యల గురించి బయటపెట్టారు. ఈయన గత కొద్దిరోజులు ఒక వింత వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించారు. తాను బ్రతికినన్ని రోజులు ఈ వ్యాధికి మందులు వేసుకోవాల్సిందేనని తెలిపారు.
41 ఏళ్ల వయసులో అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ADHD) వ్యాధి నిర్ధరణ అయినట్లు చెప్పారు. ఇది మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. శ్రద్ధ, ప్రవర్తన, ప్రేరణ నియంత్రణను నియంత్రించే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందని తెలిపారు. ఇది పిల్లల్లో సాధారణమని తెలియజేశారు. పెద్దవారిలో చాలా అరుదుగా ఉంటుందని ఈయన వెల్లడించారు.
ఈ విధంగా ఫహాద్ ఇలాంటి వ్యాధితో బాధపడుతున్నారు అనే విషయం తెలిసే అభిమానులు షాక్ అవుతున్నారు. ఇక ఈయన సినిమాల విషయానికి వస్తే త్వరలోనే పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో ఈయన పాత్ర మరింత హైలెట్ గా ఉండబోతుందని తెలుస్తుంది ఇక ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది..
Read More: ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాత.. ఎన్టీఆర్ జయంతి తారక్ ఎమోషనల్ పోస్ట్!