ప్రభాస్ కల్కి సినిమా అనుకుని రాజశేఖర్ కల్కికి టికెట్ బుక్ చేసుకున్న ఫ్యాన్స్.. హీరో రియాక్షన్ ఇదే?

June 24, 2024

ప్రభాస్ కల్కి సినిమా అనుకుని రాజశేఖర్ కల్కికి టికెట్ బుక్ చేసుకున్న ఫ్యాన్స్.. హీరో రియాక్షన్ ఇదే?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన కల్కి సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా జూన్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఈ బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్దిసేపటికే హౌస్ ఫుల్ కావడం గమనార్హం. ఇలా కల్కి సినిమా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు అత్యధిక థియేటర్లలో విడుదల కానుంది.

ఇదిలా ఉండగా ప్రభాస్ కల్కి సినిమా అనుకొని ఎంతోమంది అభిమానులు హీరో రాజశేఖర్ నటించిన కల్కి సినిమాకు టికెట్లు బుక్ చేసుకోవడం వెలుగులోకి వచ్చింది. ప్రభాస్ సినిమా క్రేజ్ ను రాజశేఖర్ కల్కి సినిమా క్యాచ్ చేసుకోవాలని చూసిందో ఏమో కానీ తిరిగి ఈ సినిమాని కూడా విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ కల్కి అనుకొని రాజశేఖర్ సినిమాకి భారీ స్థాయిలో టికెట్స్ బుక్ అయ్యాయి.

ఇలా అడ్వాన్స్ బుకింగ్ ఏకంగా 6 షోలకు బుక్ కావడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు తాము ప్రభాస్ సినిమా కాకుండా రాజశేఖర్ సినిమాకి బుక్ చేసుకున్నామని తెలియడంతో బుక్ మై షో పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ గగ్గోలు పెడుతున్నారు. ఇక ఈ విషయంపై బుక్ మై షో స్పందించింది.

టికెట్ బుక్ చేసుకున్న అభిమానులు ప్రేక్షకులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలిపారు. రాజశేఖర్ సినిమాకు బుక్ చేసుకున్న కల్కి టికెట్లతో ప్రభాస్ సినిమా చూడచ్చని తెలిపారు. అంతేకాకుండా ఈ టికెట్ల విషయంపై హీరో రాజశేఖర్ కూడా స్పందించారు. ఆయన రెస్పాన్స్ ఫన్నీగా ఉంది. నాకసలు సంబంధం లేదు.. జస్ట్ జొకింగ్. డియర్ ప్రభాస్, నాగ్ అశ్విన్ లకు నా శుభాకాంక్షలు. వైజయంతి మూవీస్, దత్తు గారికి ఆల్ ది బెస్ట్. కల్కి 2898 AD చిత్రంతో చరిత్ర సృష్టిస్తారని ఆశిస్తున్నా అంటూ ట్వీట్ చేశారు.

Read More: Kalki 2898 AD Release Trailer: కల్కి 2898 ఏడీ రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది.. అదిరిపోయిందంతే..

ట్రెండింగ్ వార్తలు