ప్రేమలు హీరోయిన్‏కు చుక్కలు చూపించిన ఫ్యాన్స్.. వీడియో వైరల్!

June 4, 2024

ప్రేమలు హీరోయిన్‏కు చుక్కలు చూపించిన ఫ్యాన్స్.. వీడియో వైరల్!

ఇటీవల మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాల్లో ప్రేమలు సినిమా ఒకటి గిరీష్ ఏడీ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. కేరళతో పాటు తమిళనాడులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో కూడా రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేమలు సినిమా ఊహించని స్థాయిలో వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమాలో నటించిన హీరోయిన్ మమిత బైజుకు ఒక్కసారిగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఒక్క సినిమాతో సౌత్ కుర్రవాళ్ల క్రష్ గా మారిపోయింది.

ఎక్కడ చూసిన మమిత ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో మమితా పేరు మారుమోగింది. దీంతో తెలుగులో మమితకు వరుస ఆఫర్స్ రావడం ఖాయం అని అందరు అనుకున్నారు. కానీ ఇప్పటివరకు ఈ బ్యూటీ ఒక్క సినిమా అనౌన్స్ చేయలేదు. కానీ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కొత్త ప్రాజెక్టులో ఈ బ్యూటీ ఛాన్స్ కొట్టేసిందని టాక్ నడిచింది. అయితే సినిమా ఆఫర్స్ అప్డేట్స్ అంతగా వినిపించకపోయినా మమితాకు సోషల్ మీడియాలో మాత్రం క్రేజ్ రోజు రోజుకి పెరుగుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మకు షాకిచ్చారు అభిమానులు.

చెన్నైలోని షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం వెళ్లింది మమితా. అక్కడ తమ అభిమాన హీరోయిన్ ను చూసేందుకు ఫ్యాన్స్ భారీగా ఎగబడ్డారు. మమితాను చుట్టుముట్టి ఊపిరి ఆడనివ్వకుండా చేశారు. బాడీగార్డ్స్ సాయంతో ఫ్యాన్స్ గుంపు నుంచి బయటపడింది మమిత. ఇందుకు సంబంధించిన వీడియోస్ వైరల్ గా మారింది. పాపం అభిమానుల దెబ్బకు చుక్కలు చూసింది మమిత.

Read More: శివాజీ కూతురిని గెలికిన సుడిగాలి సుధీర్.. కామన్ సెన్స్ లేదా అంటూ వార్నింగ్ ఇచ్చిన శివాజీ!

ట్రెండింగ్ వార్తలు