రామోజీరావుకు టాలీవుడ్ ఘన నివాళి.. రేపు షూటింగులు బంద్!

June 8, 2024

రామోజీరావుకు టాలీవుడ్ ఘన నివాళి.. రేపు షూటింగులు బంద్!

చెరుకూరి రామోజీరావు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ నేడు ఉదయం తెల్లవారుజామున మరణించిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నటువంటి ఈయన నేడు ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తూ ఉండడంతో వెంటీలెటర్ పై ఉంచి డాక్టర్లు తనకు చికిత్సను అందిస్తున్నారు అయితే ఈయన పరిస్థితి మరింత క్షీణించి మరణించారు. ఇక ఈ విషయం తెలిసి ఒక్కసారిగా చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

రామోజీరావు పత్రికా రంగంలో ఎంతో ఒరవడిని సాధించారు. ఈయన కేవలం పత్రికా రంగంలో మాత్రమే కాకుండా ఎన్నో రకాల బిజినెస్లను స్థాపించి ఎంతో మందికి జీవనోపాధిని కల్పించారు. ఇక చిత్ర పరిశ్రమలో కూడా ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ స్థాపించి ఎంతోమంది కొత్తవారికి అవకాశాలు కల్పించి వారికి ఒక గొప్ప జీవితాన్ని ప్రసాదించారని చెప్పాలి. ఇలా రామోజీ రావు వల్ల ఎంతో మంది సెలబ్రిటీలు ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

ఇక ఈయన మరణ వార్త తెలియడంతో ఒక్కసారిగా చిత్ర పరిశ్రమ షాక్ అయింది. దీంతో ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు అలాగే రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున తరలివస్తూ ఈయన చివరి చూపుకు నోచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తెలుగు చిత్ర పరిశ్రమ రామోజీరావు మరణం పట్ల ఘన నివాళులు అర్పించారు.

రామోజీరావు మరణ వార్తను విని ఎంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న టాలీవుడ్ ఇండస్ట్రీ సంతాప సూచికంగా ఆదివారం సినిమాల షూటింగులకు బంద్ ప్రకటించినట్టు ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ తెలిపారు. ఇక రామోజీరావు అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో జరగబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు జరపడం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలను జారీ చేశారు.

Read More: ప్రశాంత్ నీల్ సినిమా కోసం తారక్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. కెరియర్ లోనే హైయెస్ట్?

ట్రెండింగ్ వార్తలు