Bigg Boss Telugu 8: ఇద్దరు స్టార్ కపుల్స్..బిగ్ బాస్ హిస్టరీలోనే ఫస్ట్ టైం?

July 11, 2024

Bigg Boss Telugu 8: ఇద్దరు స్టార్ కపుల్స్..బిగ్ బాస్ హిస్టరీలోనే ఫస్ట్ టైం?

తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న రియాలిటీ షో లలో బిగ్ బాస్ రియాల్టీ షో ఒకటి. ఈ కార్యక్రమం ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ఏడు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం త్వరలోనే ఎనిమిదవ సీజన్ కూడా ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సీజన్ ప్రసారానికి నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.

ఇక త్వరలోనే ఈ కార్యక్రమం ప్రసారమవుతుందని తెలుస్తుంది ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్లను కూడా ఎంపిక చేశారని సమాచారం ఇప్పటికే కొంతమంది కంటెస్టెంట్ ల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక బిగ్ బాస్ హౌస్లో గతంలో కొంతమంది స్టార్ కపుల్స్ ని కూడా హౌస్ లోకి పంపించేవారు అయితే ఇప్పటివరకు కేవలం ఒక జంటను మాత్రమే హౌస్ లోకి పంపించారు ఇక సీజన్ సెవెన్ కార్యక్రమంలో ఇలా సెలబ్రిటీ కపుల్స్ ఎవరూ కూడా వెళ్లలేదు.

ఇకపోతే సీజన్ 8లో ఈ కార్యక్రమంలో ఇద్దరు స్టార్ కపుల్స్ పాల్గొనబోతున్నారని సమాచారం. ఆ రెండు జంటలకు సపరేటు రూములు ఇవ్వడమే కాకుండా ఇతర వసతులను కూడా ఏర్పాటు చేశారని తెలుస్తుంది. ఇలా బిగ్ బాస్ హిస్టరీలోనే ఇద్దరు స్టార్ కపుల్స్ ని పంపించడమే కాకుండా సపరేట్ రూమ్స్ ఇవ్వడం అనేది లేదు మొదటిసారి ఈ సీజన్లో ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తుంది.

మరి ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే ఆ ఇద్దరు స్టార్ కపుల్స్ ఎవరు అనే విషయంపై ఎంతో ఆసక్తి నెలకొంది. ఇక ఈ కార్యక్రమానికి హోస్టుగా నాగార్జున వ్యవహరించబోతున్నారు ఈయన మూడవ సీజన్ నుంచి ఇప్పటివరకు వరుసగా ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేయడమే కాకుండా ఎంతో విజయవంతంగా ముందుకు తీసుకెళుతున్నారు

ట్రెండింగ్ వార్తలు