చిరంజీవి ఇంట్లో దొంగగా మారిన సుమ.. అసలు విషయం చెప్పిన మెగాస్టార్?

April 1, 2024

చిరంజీవి ఇంట్లో దొంగగా మారిన సుమ.. అసలు విషయం చెప్పిన మెగాస్టార్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి సుమ కనకాల ఒకరు. ఈమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటి నుంచి అద్భుతమైన మాట తీరుతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా దశాబ్దాలుగా ఇండస్ట్రీలో యాంకర్ గా కొనసాగుతూ ఉన్నటువంటి ఈమె హైదరాబాదులో జరిగిన వేడుకకు హాజరయ్యారు.

హైదరాబాద్లో జరిగిన సోషల్ మీడియా ఫ్యాక్టరీ అనే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి విజయ్ దేవరకొండ వంటి వారందరూ హాజరయ్యారు. ఈ వేడుకకు సోషల్ మీడియా స్టార్స్ అందరు కూడా హాజరై సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమానికి సుమ యాంకర్ గా వ్యవహరించారు. అయితే ఈ కార్యక్రమానికి సుమ బ్రౌన్ కలర్ సూట్ ధరించి వచ్చారు. ఇక వేదిక పైకి చిరంజీవి రావడంతోనే సుమపై జోక్స్ వేశారు.

ఇప్పుడు తాను సురేఖకు ఫోన్ చేస్తున్నానని చెప్పి వేదికపైనే ఫోన్ చేయడమే కాకుండా వేదికపై నుంచి సురేఖ ఇటీవల కాలంలో నాది ఒక ఒక బ్రౌన్ కలర్ సూట్ కనిపించలేదని మనం వెతుకుతూనే ఉన్నాం కదా అది ఇప్పుడు కనిపించింది ఇక్కడే ఉంది నేను తీసుకు వస్తానంటూ చెప్పారు. అది మరెవరో కాదు తీసింది మన ఇంటికి వచ్చినప్పుడు సుమ తన చేతివాటం ప్రదర్శించింది అంటూ ఈ సందర్భంగా చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

చిరంజీవి చెప్పిన ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే నిజంగానే ఈమె తన ఇంట్లో దొంగతనం చేసిందా అన్నా సందేహం రాకమానదు కానీ ఇదంతా చిరంజీవి సరదాగా చేశారని, చిరంజీవి సుమ మాట తీరుతో అక్కడ ఉన్నటువంటి వారందరూ ఎంతగానో నవ్వుకున్నారని చెప్పాలి. ఇక చిరంజీవి ప్రస్తుతం డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమాలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

Read More: వీకెండ్ వస్తే రష్మిక ఆ పని చేస్తుందా.. మంచి అలవాటే అంటున్న నేటిజన్స్?

ట్రెండింగ్ వార్తలు