ఆనంద్ దేవ‌ర‌కొండ గం.గం..గణేశా సెకండ్ సింగిల్ అప్‌డేట్ రిలీజ్.. ఈ సారి హిట్ గ్యారెంటీ అంటూ?

May 3, 2024

ఆనంద్ దేవ‌ర‌కొండ గం.గం..గణేశా సెకండ్ సింగిల్ అప్‌డేట్ రిలీజ్.. ఈ సారి హిట్ గ్యారెంటీ అంటూ?

టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ గురించి మనందరికీ తెలిసిందే. ఇటీవలే బేబీ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఆనంద్ దేవరకొండ ఈ సినిమాతో సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమాతో ఆనంద్ క్రేజ్ మరింత పెరిగింది. దీంతో అదే ఊపుతో ఇప్పుడు వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నారు ఆనంద దేవరకొండ. ఇది ఇలా ఉంటే ఆనంద్ దేవరకొండ తాజాగా నటిస్తున్న చిత్రం గంగం గణేశా. యాక్షన్ కామెడీ జోనర్ తో ఈ సినిమా తెరకెక్కబోతోంది.

ఈ మూవీని హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఉదయ్ బొమ్మిశెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో ప్రగతి శ్రీవాత్సవ హీరోయిన్‌ గా నటిస్తోంది. కాగా ఈ చిత్రం మే 31 ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్, ఓ సాంగ్ ను విడుద‌ల చేయ‌గా మంచి స్పంద‌న వ‌చ్చింది. తాజాగా సెకండ్ సింగిల్ అప్‌డేట్‌ను ఇచ్చింది చిత్ర బృందం.

పిచ్చిగా నచ్చేసావే అంటూ సాగే పాట‌ను మే 4 శ‌నివారం మ‌ధ్యాహ్నాం 12.06 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు మేకర్స్. ఒక వైపు కామెడీతో పాటు మ‌రోవైపు రామ‌సీమ బ్యాక్‌డ్రాప్‌తో వ‌స్తుండ‌డంతో ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల్లో మంచి అంచ‌నాలే ఉన్నాయి. ఎందుకు సంబంధించిన అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ సారి కూడా ఆనంద్ కెరియర్ లో హిట్టు పడ్డట్టే హిట్టు గ్యారెంటీ అంటూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు.

Read More: రష్మిక మందన్న చెల్లెలిని చూశారా… ఎంత క్యూట్ గా ఉందో.. వైరల్ అవుతున్న ఫోటో!

ట్రెండింగ్ వార్తలు