గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈవెంట్ ఎక్కడంటే!

May 23, 2024

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈవెంట్ ఎక్కడంటే!

మాస్ కా దాస్ విశ్వక్సేన్ హీరోగా, చైతన్య కృష్ణ దర్శకత్వంలో వస్తున్న సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ సినిమా గత ఏడదే ప్రేక్షకుల ముందుకి రావలసింది కానీ అనివార్య కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈసారి ఎలాంటి వాయిదా పడకుండా మే 31న ప్రేక్షకుల ముందుకి పక్కాగా వస్తుందని చెప్తున్నారు మూవీ మేకర్స్. ఈ విషయానికి సంబంధించి విశ్వక్ సేన్ ఇటీవల విడుదల చేసిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది.

సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ట్రైలర్ లాంచ్ పై అప్డేట్ ఒకటి విడుదల అయింది. లంకల రత్న గ్యాంగ్ ఇంటెన్స్ యాక్షన్ పార్ట్ ని చూసేందుకు రెడీగా ఉండండి అంటూ ఈ సినిమా ట్రైలర్ మే 25న సాయంత్రం నాలుగు గంటల ఆరు నిమిషాలకు హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్ లోని దేవి థియేటర్ లో విడుదల చేయనున్నట్లు సినిమా టీం ప్రకటించింది. ఈ సినిమాలో నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

హీరో కత్తి పట్టుకుని శత్రువులని చీల్చి చెండాడుతున్న పోస్టర్ అలాగే హీరో హీరోయిన్ల లిప్ లాక్ పోస్టర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ఈ సినిమాలో హీరో లంకల రత్నగా కనిపించబోతున్నాడు. సుత్తంలా సూసిపోకలా అంటూ ఈ సినిమా నుంచి విడుదలైన పాట ఇప్పటికే మిలియన్ల కొద్దీ వ్యూస్ ని సొంతం చేసుకుంది.

అడవి కి గొడ్డలి బ్యాడ్, కడుపుకి అంబలి బ్యాడ్, మట్టికి నాగలి బ్యాడ్ అంటూ సాగే మరో పాట సినిమాకు హైలెట్ గా నిలిచేలా సాగుతోంది. సితార ఎంటర్టైన్మెంట్ పై సూర్యదేవర నాగవంశీ, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పై సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో వెంకట్ ఉప్పుటూరి గోపీచంద్ ఇనుమూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నారు.

Read More: ఆ లగ్జరీ హౌస్ నా కూతురి కష్టం.. ఆ వార్తలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన రకుల్ తండ్రి?

ట్రెండింగ్ వార్తలు