Ghost Movie: నాగార్జున ‘ఘోస్ట్‌’ కంప్లీట్‌

August 8, 2022

Ghost Movie: నాగార్జున ‘ఘోస్ట్‌’ కంప్లీట్‌

నాగార్జున(Nagarjuna) హీరోగా ప్రవీణ్‌ సత్తారు(praveen sattaru) దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఘోస్ట్‌’(Ghost). ఇందులో సోనాల్‌ చౌహాన్‌(Sonal Chouhan) హీరోయిన్‌గా నటిస్తున్నారు. హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు ప్రవీణ్‌ సత్తారు దర్శకుడు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. నారాయణ్‌దాస్‌ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్‌రావు,శరత్‌ మరార్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ దసరా సందర్భంగా అక్టోబరు 5న విడుదల కానుంది. ఇక ఇందులో పవర్‌ఫుల్‌ ఇంటర్‌పోల్‌ ఆఫసీర్‌ విక్రమ్‌(Officer Vikram) పాత్రలో నటించారు నాగార్జున. కేచ్‌ స్టంట్‌ మాస్టర్‌గా వర్క్‌ చేశారు. మార్క్‌ కె రాబిన్‌ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

Ghost Movie

ఇక నాగార్జున ఓ కీ రోల్‌ చేసిన ‘బ్రహ్మాస్తం’ సినిమా తొలి పార్టు ‘బ్రహ్మాస్త్రం: శివ పార్టు 1’(Bramhastram Part 1) సెప్టెంబరు 9న విడుదల కానుంది. రణ్‌బీర్‌ కపూర్(Ranbir Kapoor) ఆలియా భట్‌(Alia Bhatt) జంటగా అమితాబ్‌బచ్చన్(Amitab Bachhan), డింపుల్‌ కపాడియా కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో రణ్‌బీర్‌కపూర్‌ తండ్రి పాత్రలో నాగార్జున నటించారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు నాగార్జున తెలుగులో నటించాల్సిన కొత్త సినిమాపై ఓ స్పష్టత త్వరలో రానుంది. తమిళ దర్శకుడు మోహన్‌రాజా నాగార్జునకు ఓ కథ చెప్పగా, నాగ్‌కు ఆ కథ నచ్చిందని, నాగార్జున కెరీర్‌లో వందో చిత్రంగా ఈ సినిమా రూపొందనుందనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. అంతేకాదండోయ్‌..ఈ సినిమాలో అఖిల్‌ కూడా ఓ కీలక పాత్ర చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇది నిజం అయితే బాగుండని అక్కినేని ఫ్యాన్స్‌ ఆశపడుతున్నారు.

Malashree: కూతుర్ని హీరోయిన్‌గా పరిచయం చేసిన నటి మాలా శ్రీ

ట్రెండింగ్ వార్తలు