ఓటీటీకి సఖి!

January 4, 2022

ఓటీటీకి సఖి!

GOODLUCKSAKHI: కీర్తీ సురేశ్‌ ప్రధాన పాత్రలో చేసిన గుడ్‌లుక్‌ సఖి సినిమాను పలుమార్లు వాయిదా వేసిన పిదప గత ఏడాది డిసెంబరు 10న విడుదల చేయాల నుకున్నారు. కానీ ఆ తర్వాత మనసు మార్చుకుని డిసెంబరు 31కి వాయిదా వేశారు. కానీ ఇప్పుడు ‘గుడ్‌లుక్‌ సఖి’ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందన్న విషయంపై క్లారిటీ లేదు. పైగా ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి పెద్ద సినిమా వాయిదా పడి, ఇటు చిన్న సినిమాలు పెద్ద సంఖ్యలో విడుదలకు రెడీ అవుతున్న ఈ తరుణంలో కూడా గుడ్‌లక్‌సఖి సినిమా రిలీజ్‌ గురించి ఈ చిత్రంయూనిట్‌ మాట్లాడటం లేదు. ఈ అంశాలను బట్టి చూస్తే ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుందా? అనే సందేహాలు కూడా వస్తున్నాయి. ఇక నగేశ్‌కుకునూరు దర్శకత్వంలో కీర్తీసురేష్‌ ప్రధాన పాత్రధారిగా రైఫిల్‌ షూటింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో జగపతిబాబు, ఆది పినిశెట్టి కీలక పాత్రలు చేశారు.

ReadMore: రవితేజ..బెల్లంకొండ అసలైన దొంగ ఎవరో?

ట్రెండింగ్ వార్తలు