Guppedantha Manasu: గుప్పెడంత మనసు నటి వసుధార ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

July 2, 2024

Guppedantha Manasu: గుప్పెడంత మనసు నటి వసుధార ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Guppedantha Manasu Serial Vasudhara Remuneration: ఇటీవల కాలంలో బుల్లితెర హీరోయిన్లకు కూడా ఎంతో మంచి క్రేజ్ ఏర్పడుతుంది. బుల్లితెర ప్రసారమయ్యే సీరియల్ లో హీరోయిన్లుగా నటిస్తూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న వారు ఉన్నారు. ఇలాంటి వారిలో కన్నడ ముద్దుగుమ్మ రక్ష గౌడ్ ఒకరు. రక్ష గౌడ్ అంటే బహుశా ఈమె ఎవరు అని ఆలోచించవచ్చు కానీ వసుధార అంటే మాత్రం అందరికీ టక్కున గుర్తుకు వస్తుంది. స్టార్ మా లో ప్రసారమయ్యే గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఈ సీరియల్లో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నటువంటి ముఖేష్ గౌడ్, రక్ష గౌడ్ జంటకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరూ రిషి వసుధార పాత్రలలో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ సీరియల్ నుంచి రిషి బయటకు వెళ్ళకపోవడంతో ఏకంగా రేటింగ్స్ మొత్తం పడిపోయాయి . దీంతో నిర్మాతలు ఏకంగా రిషి క్యారెక్టర్ ను తిరిగి సీరియల్ లో భాగం చేశారు.

ఇక ఈ సీరియల్లో వసుధార పాత్రలో నటించిన రక్షా గౌడ కన్నడ నటి అయినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయిల ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్నారు. తెలుగులో ఈమె ఈ ఒక్క సీరియల్ మాత్రమే నటిస్తున్నారు. అయినప్పటికీ విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే ఒకరోజు షూటింగ్లో పాల్గొంటే వసుధార రెమ్యూనరేషన్ ఎంత అనే విషయంపై ఆసక్తి నెలకొంది.

వసుధార పాత్రలో నటిస్తున్నటువంటి రక్ష గౌడ్ ఒకరోజు షూటింగ్లో పాల్గొంటే ఆమె 17వేల వరకు రెమ్యూనరేషన్ అందుకు అంటున్నారని తెలుస్తుంది. ఎంతోమంది స్టార్ హీరోయిన్లే ఒకానొక సమయంలో 5000 కు పని చేసిన వారు ఉన్నారు. ఇక 17,000 అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. ఇక బుల్లితెర సీరియల్స్ లో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్నటువంటి వారిలో కార్తీకదీపం నటి ప్రేమి విశ్వనాథ ఒక్కో రోజుకు ఏకంగా 40 వేల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటూ టాప్ పొజిషన్లో ఉన్నారు

Related News

ట్రెండింగ్ వార్తలు