వివాహ బంధానికి వీడ్కోలు పలికిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. అర్థం చేసుకోవాలంటూ విన్నపం!

May 14, 2024

వివాహ బంధానికి వీడ్కోలు పలికిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. అర్థం చేసుకోవాలంటూ విన్నపం!

జీవీ ప్రకాష్ కుమార్ పరిచయం అక్కర్లేని సంగీత దర్శకుడు, నటుడు. ఈయన యుగానికి ఒక్కడు, రాజారాణి, అసురన్, ఆకాశమే నీ హద్దు, డార్లింగ్ వంటి సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్. అంతేకాకుండా ఇతను మంచి నటుడు కూడా. పెన్సిల్, త్రిష ఇల్లా నయనతార, ఎర్ర పసుపు పచ్చ వంటి సూపర్ హిట్స్ సినిమాలలో హీరోగా నటించాడు. అలాగే జైల్, సెల్ఫీ, అదియే వంటి చిత్రాలలో కీలక పాత్రలు పోషించాడు.

ఈయన సైంధవి అనే సింగర్ ని 2013 లో పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరూ ఇప్పుడు విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు ఈ దంపతులు. 11 ఏళ్ల వైవాహిక జీవితానికి పుల్ స్టాప్ పెడుతున్నట్లు జీవి ప్రకాష్ కుమార్ సోషల్ మీడియాలో ప్రకటించాడు. సైంధవితో చర్చించి, పరస్పర అంగీకారంతోనే తాము విడిపోవాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపాడు.

సైంధవి కూడా ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఫ్యాన్స్ ఒకసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే జీవి ప్రకాష్,సైంధవీ ఇద్దరు చిన్నతనం నుంచి పరిచయస్తులే కాకుండా బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. ఇద్దరూ కలిసి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ప్రస్తుతం వీరికి అన్వీ అనే నాలుగేళ్ల పాప కూడా ఉంది. మానసిక ప్రశాంతత, ఇద్దరి జీవితాల్లో మెరుగు కోసం ఒకరికి ఒకరం పరస్పర గౌరవంతో ఈ నిర్ణయం తీసుకున్నాము.

ఇలాంటి కీలక తరుణంలో మా ప్రైవసీకి భంగం కలిగించకుండా ఉండేందుకు మీడియా స్నేహితులు అభిమానులు మా నిర్ణయాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం అంటూ జీవి ప్రకాష్,సైంధవీ తమ పోస్టులలో విన్నవించుకున్నారు. జీవి ప్రకాష్ విషయానికి వస్తే ఇతను 2006లో విడుదలైన వీల్ అనే తమిళ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. ప్రస్తుతం అతను చిత్ర సీమలో టాప్ మోస్ట్ డైరెక్టర్. అయితే ప్రస్తుతం ఈ దంపతుల విడాకుల టాపిక్ చిత్రసీమలో హాట్ టాపిక్ గా మారింది.

Read More: పెళ్లికి ముందే తల్లి కాబోతున్న పూజా హెగ్డే… షాక్ లో ఫాన్స్?

Related News

ట్రెండింగ్ వార్తలు