ఈ సారి ఆస‌క్త‌క‌ర‌మైన టైటిల్‌తో రాబోతున్న ద‌ర్శ‌కుడు జీవీకే..

December 15, 2021

ఈ సారి ఆస‌క్త‌క‌ర‌మైన టైటిల్‌తో రాబోతున్న ద‌ర్శ‌కుడు జీవీకే..

`మ‌ణిశంక‌ర్` ఫేమ్ జి. వెంక‌ట్‌ కృష్ణ‌న్(జీవికే) ద‌ర్శ‌క‌త్వంలో షార్ప్ మైండ్స్ ఫిలిం ఫ్యాక్ట‌రీ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా ఓ ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ తెర‌కెక్కుతోంది. డామిట్ డేవిడ్ రాజుకి పెళ్ళైపోయింది.. అనే ఆస‌క్తిక‌ర టైటిల్‌తో రాబోతున్న ఈ మూవీ ప్రారంభోత్స‌వం ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ ఫిలిం చాంబ‌ర్ అద్య‌క్షుడు ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్, ఉపాద్య‌క్షుడు నెహ్రు, హీరో శివ కంఠ‌మ‌నేని, పెళ్లి సంద‌D ద‌ర్శ‌కురాలు గౌరి రోణంకి, ద‌ర్శ‌కుడు మ‌ల్లికార్జున్, నిర్మాత ఆచార్య శ్రీ‌నివాస్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా..

ద‌ర్శ‌కుడు జీవీకే మాట్లాడుతూ – “మా నిర్మాత‌లు సినిమా మీద ప్యాష‌న్‌తో ఒక మంచి ప్ర‌య‌త్నంలో భాగంగా షార్ప్ మైండ్స్ ఫిలిం ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌ను స్థాపించారు. అందులో మొద‌ట‌గా `డామిట్ డేవిడ్ రాజుకి పెళ్ళైపోయింది `చిత్రాన్ని కిర‌ణ్ కుమార్ గుడిప‌ల్లి, కె. రామ‌చంద్రారెడ్డి (కేఆర్‌సి) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ద‌ర్శ‌కుడిగా ఇది నా మూడ‌వ సినిమా. ఒక మంచి కాన్సెప్ట్ మ‌రియు మంచి టీమ్‌తో మీ ముందుకు రాబోతున్నాం. ఎమ్ ఎల్ రాజా సంగీత ద‌ర్శ‌కత్వంలో సాంగ్స్ రికార్డింగ్ స్టార్ట్ చేశాం. త్వ‌ర‌లోనే ఆర్టిస్టుల వివ‌రాలు తెలియ‌జేస్తాం“ అన్నారు.

నిర్మాత కె. రామచంద్రారెడ్డి మాట్లాడుతూ – “జీవీకేగారు క‌మిట్‌మెంట్‌తో ప‌నిచేసే డైరెక్ట‌ర్‌. ఆయ‌న మీద పూర్తి భ‌రోసాతో మా బ్యాన‌ర్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఒక ప్ర‌ముఖ హీరోయిన్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేయ‌బోతుంది. ప్ర‌స్తుతం ఆర్టిస్టుల ఎంపిక జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్‌ స్టార్ట్ చేస్తాం“ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు