సభ్యత లేని మనిషి అంటూ బాలయ్య వ్యవహారంపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!

May 30, 2024

సభ్యత లేని మనిషి అంటూ బాలయ్య వ్యవహారంపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఈయన ఇటీవల యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమా ప్రీ రిలీజ్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సినిమా ఈ నెల 31వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఘనంగా ఈ వేడుకను నిర్వహించారు. అయితే ఈ వేడుకలో అనుకొని సంఘటన జరిగిన సంగతి తెలిసిందే.

ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ నటి అంజలి పట్ల కాస్త అనుచిత ప్రవర్తనకు సంబంధించి ఈయన ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. వేదికపై సినీ సెలెబ్రెటీలందరూ నిలబడి ఉండగా బాలకృష్ణ హీరోయిన్ అంజలిని తోయటంతో ఒక్కసారిగా ఆమె భయపడిపోయారు. అలాగే అక్కడ ఉన్న వారందరూ కూడా షాక్ అయ్యారు అనంతరం వారంతా నవ్వుతూ ఈ సంఘటనని కవర్ చేశారు.

ఈ క్రమంలోనే ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో బాలకృష్ణ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అయితే తాజాగా బాలయ్య చేసినటువంటి ఈ పనికి బాలీవుడ్ డైరెక్టర్ సైతం విమర్శలు కురిపించారు. బాలీవుడ్ దర్శకుడు హన్సల్ మెహతా గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. స్కామ్1992 (Scam 1992), ఛల్, షాహిద్, సిటీలైట్స్, అలీఘర్ తదితర చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

తాజాగా ఈయన X వేదికగా స్పందిస్తూ బాలయ్య వ్యవహారంపై విమర్శలు చేశారు. ఎవరు ఈ సభ్యత సంస్కారం లేని మనిషి అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. కాగా ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. మరోవైపు ఇదే ఈవెంట్‌లో బాలయ్య వాటర్ బాటిల్లో మందు కలుపుకొని వచ్చారని అది తాగటం వల్లే హీరోయిన్ పట్ల ఇలా ప్రవర్తించారని బాలయ్య పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

Read More: సీక్రెట్‏గా రెండో పెళ్లి చేసుకొని షాకిచ్చిన బిగ్‏బాస్ విన్నర్.. నెట్టింట ఫోటోస్ వైరల్!

Related News

ట్రెండింగ్ వార్తలు