మరో అరుదైన రికార్డు సృష్టించిన హనుమాన్.. 92 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో అలా?

February 3, 2024

మరో అరుదైన రికార్డు సృష్టించిన హనుమాన్.. 92 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో అలా?

టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన చిత్రం హనుమాన్. తేజా సజ్జా హీరోగా నటించిన ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇందులో వరలక్ష్మీ శరత్‌కుమార్‌, వినయ్‌ రాయ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టును అందుకోవడంతో పాటు ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామిని సృష్టిస్తోంది.

ఈ సినిమా విడుదల అయ్యి ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఈ సినిమా మేనియా ఇంకా తగ్గడం లేదు. హనుమాన్ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది. తాజాగా మరో సరికొత్త రికార్డును సృష్టించింది హనుమాన్ సినిమా. ఇంతకీ ఆ రికార్డు ఏంటి అన్న విషయానికి వస్తే.. ఇటీవలె సంక్రాంతి పండుగకు విడుదలైన హనుమాన్ సినిమా సంక్రాంతి సీజన్‌లో రిలీజైన సినిమాల జాబితాలోఅత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో నంబరు 1గా నిలిచింది. సోషల్‌ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తూ టీమ్‌ ఆనందం వ్యక్తం చేసింది.

ఈ మేరకు పోస్టర్‌ను పంచుకుంది.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల ప్రేమతో హనుమాన్‌ చరిత్ర సృష్టించింది. 92 ఏళ్ల టాలీవుడ్‌ ప్రస్థానంలో ఆల్‌టైమ్‌ సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది అని పేర్కొంది. ఈ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తుండడంతో దర్శకుడు ప్రశాంత వర్మతో పాటు మూవీ మేకర్స్ ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా రికార్డుల మోత మోగిస్తూ కోట్లలో కలెక్షన్స్ను రాబడుతోంది. అయితే ఈ సినిమా చివర్లో ఈ సినిమాకు సీక్వెల్ గా మరో సినిమా ఉంటుందని ఆ సినిమాకు జై హనుమాన్ అనే టైటిల్ ని కూడా ఖరారు చేసిన విషయం తెలిసిందే.

Read More: పూనమ్ బతికే ఉంది.. వరస్ట్ పబ్లిసిటీ, మరి ఇంత దిగజారాలా అంటూ నెటిజన్స్ ఫైర్?

ట్రెండింగ్ వార్తలు