మోక్షజ్ఞను లాంచ్ చేయనున్న యంగ్ డైరెక్టర్…అదిరిపోయిన మోక్షజ్ఞ న్యూ లుక్!

July 2, 2024

మోక్షజ్ఞను లాంచ్ చేయనున్న యంగ్ డైరెక్టర్…అదిరిపోయిన మోక్షజ్ఞ న్యూ లుక్!

సినీ ఇండస్ట్రీలో ఇప్పటికి వారసుల పరంపర కొనసాగుతుంది. ఎంతోమంది సినీ వారసులు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం కూడా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే మోక్షజ్ఞ ఎంట్రీ ఇదిగో అదిగో అంటూ గత రెండు మూడు సంవత్సరాలుగా చెబుతూనే ఉన్న ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు.

ఇకపోతే మోక్షజ్ఞ ఎంట్రీ గురించి బాలయ్య కూడా ఇటీవల ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. త్వరలోనే తన కుమారుడు మోక్ష కూడా ఇండస్ట్రీలోకే రాబోతున్నారని పలు సందర్భాలలో తెలిపారు. ఇకపోతే ఈయన అద్భుతమైన ప్రేమ కథ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని లేదు యాక్షన్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.

ఇకపోతే మోక్షజ్ఞ ఇదివరకు అనిల్ రావిపూడి, బోయపాటి వంటి స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్లోనే ఇండస్ట్రీ లోకి ఎంటర్ ఇవ్వబోతున్నారని వార్తలు వచ్చాయి కానీ తాజాగా మరో డైరెక్టర్ పేరు కూడా లిస్టులోకి వచ్చింది. ఈయన యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లోని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

ప్రశాంత్ వర్మ ఇటీవల హనుమాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రశాంత్ వర్మకు మోక్షజ్ఞ బాధ్యతలను బాలయ్య అప్పగించారంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలు ఎంతవరకు నిజం ఉందనేది తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల మోక్షజ్ఞకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోలలో ఈయన లుక్ అభిమానులను ఫిదా చేస్తోంది

Related News

ట్రెండింగ్ వార్తలు