January 2, 2024
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నటుడు తేజ సజ్జ హీరోగా నటిస్తున్నటువంటి తాజా చిత్రం హనుమాన్(HanuMan) ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అలాగే హీరో తేజ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
ఇకపోతే ఈ సినిమా 12వ తేదీ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున సినిమా నుంచి అప్డేట్స్ కూడా విడుదల చేస్తున్నారు ఇప్పటివరకు సినిమా నుంచి విడుదలైనటువంటి ట్రైలర్ టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసాయి ఇక ఈ సినిమాలో హనుమాన్ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి కూడా నటించబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సినిమాల్లో కనుక నిజంగానే హనుమాన్ పాత్రలో చిరంజీవి నటించి ఉంటే ఈ సినిమా మరో లెవల్లో ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు అయితే ఇదే విషయం గురించి డైరెక్టర్ ను ప్రశ్నించడంతో హనుమాన్ పాత్రలో ఎవరు నటించారు అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందేనని ఈయన సస్పెన్స్ చేశారు. ఇక ఈ సినిమా విడుదలకు ముందే ఓటీటీ బిజినెస్ కూడా క్లోజ్ చేసుకుందని తెలుస్తుంది.
ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 పది కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా డిజిటల్ హక్కులు అలాగే స్ట్రీమింగ్ గురించి ప్రశాంత్ వర్మ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ జి5 వారితో తాము ఒప్పందం కుదుర్చుకున్నామని అయితే ఈ సినిమా థియేటర్లో విడుదలైన 60 రోజుల తరువాతనే డిజిటల్ మీడియాలో కూడా ప్రసారం అయ్యేలాగా డీల్ కుదుర్చుకున్నామని తెలిపారు. మరి ఈ సినిమా జనవరి 12వ తేదీ విడుదలవుతుండగా మార్చి మూడవ వారం లేదా నాలుగవ వారంలో ఈ సినిమా జీ 5 లో ప్రసారం కానందని తెలుస్తుంది. దాదాపు 75 కోట్ల రూపాయలతో ఈ సినిమా తెరకెక్కిందని తెలుస్తోంది.
Read More: రోజా న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్.. వీడియో వైరల్