అలాంటి సమస్యతో బాధపడుతున్న రవితేజ… మాకు స్ఫూర్తి అంటూ డైరెక్టర్ పోస్ట్!

June 15, 2024

అలాంటి సమస్యతో బాధపడుతున్న రవితేజ… మాకు స్ఫూర్తి అంటూ డైరెక్టర్ పోస్ట్!

సినీ ఇండస్ట్రీలో ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయిన అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తూ అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న అవకాశాలు అందుకుంటూ హీరోగా సక్సెస్ అయ్యారు నటుడు రవితేజ. ఇలా చిన్న చిన్న పాత్రలలో నటిస్తున్నటువంటి ఈయనకు హీరోగా అవకాశాలు వచ్చాయి. ఈ అవకాశాన్ని ఎంతో సద్వినియోగం చేసుకున్న రవితేజ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలో జాబితాలో నిలిచిపోయారు.

హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న ఈయన త్వరలోనే మిస్టర్ బచ్చన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారి నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

ఇక ఈ సినిమా షూటింగ్లో భాగంగా డైరెక్టర్ హరీష్ శంకర్ రవితేజకు సంబంధించిన ఒక ఫోటో షేర్ చేశారు అయితే ఈ ఫోటోలో భాగంగా రవితేజ మెడకు ఒక బ్యాండ్ వేసి ఉంది అయితే పక్కన హరీష్ సైతం ఆ బ్యాండ్ ను పట్టుకొని కూర్చున్నారు. ఇలా ఈ ఫోటోని హరీష్ శంకర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో అభిమానులు కంగారు వ్యక్తం చేశారు.

ఇక ఈ ఫోటోని షేర్ చేసిన ఈయన మాస్ మహారాజ రవితేజ డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్. తీవ్రమైన మెడ నొప్పితో బాధపడుతున్నా షూటింగ్ చేస్తున్నారు. థ్యాంక్యూ అన్నయ్య. ప్రతి రోజు మమ్మల్ని ఇన్‌స్పైర్ చేస్తావు అంటూ పోస్ట్ చేశారు దీంతో ఈ పోస్ట్ పట్ల అభిమానులు స్పందిస్తూ ఆరోగ్యం జాగ్రత్త అన్నయ్య అంటూ కామెంట్లో పెడుతున్నారు.. ఇలా మెడ నొప్పి సమస్యతో బాధపడుతున్న, నిర్మాతలకు నష్టం రాకుండా ఉండటం కోసం ఈయన షూటింగ్ లో పాల్గొనడం చూసి అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు.

Read More: పవన్ తో వైరం అల్లు అర్జున్ కి ఇబ్బందే.. సంచలన వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్!

ట్రెండింగ్ వార్తలు