కొండగాలితో శ్వాసపంపకం..ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’ నుంచి సంచారి పాట…

December 16, 2021

కొండగాలితో శ్వాసపంపకం..ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’ నుంచి సంచారి పాట…

‘రాధేశ్యామ్‌’ చిత్రం నుంచి ‘ఈ రాతలే’ పాట తర్వాత ‘సంచారి’ పాట శ్రోతల ముందకు వచ్చింది. ‘కొత్త నేలపై గాలి సంతకం…కొండగాలితో శ్వాసపంపకం’ అంటూ సాగే ఈ పాట ఓ ఫ్రెష్‌ ఫీల్‌ను ఇస్తుంది. అనిరుద్‌ రవిచంద్రన్‌ ఈ సంచారి పాటను పాడగా, జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతం అందించారు. కృష్ణకాంత్‌ లిరిక్‌ రైటర్‌.ప్రభాస్‌ హీరోగా చేసిన ఈ పీరియాడికల్‌ ఫిల్మ్‌ ‘రాధేశ్యామ్‌’లో పూజాహెగ్డే హీరోయిన్‌గా కాగా కృష్ణంరాజు ఓ కీ రోల్‌ చేశారు. విక్రమాధిత్యగా ప్రభాస్, డాక్టరు ప్రేరణగా పూజాహెగ్డే, పరమహంసపాత్రలో కృష్ణం రాజు కనిపిస్తారు. రాధేశ్యామ్‌ చిత్రం జనవరి 14న విడుదల కానుంది

ట్రెండింగ్ వార్తలు