మొన్న తోసేశారు..ఇప్పుడు చేరదీశారు? ఎయిర్ పోర్ట్ లో అభిమానిని కలిసిన నాగార్జున!

June 28, 2024

మొన్న తోసేశారు..ఇప్పుడు చేరదీశారు? ఎయిర్ పోర్ట్ లో అభిమానిని కలిసిన నాగార్జున!

అక్కినేని నాగార్జున ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన ముంబై ఎయిర్ పోర్ట్ నుంచి వస్తున్న సమయంలో ఎంతో మంది అభిమానులు ఆయనతో సెల్ఫీ తీసుకోవడం కోసం ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే అక్కడ స్టాప్ కూడా నాగార్జునని కలిసి తనతో సెల్ఫీ తీసుకోవడానికి రాగ వెంటనే ఆయన బాడీగార్డ్ తనని తోయడంతో ఒకసారిగా కిందకు పడబోయారు.

ఇలా నాగార్జున సెక్యూరిటీ తనని తోయగా ఆయన కింద పడుతూ ఉండడంతో పక్కనే ఉన్న సిబ్బంది పట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నాగార్జున పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇక ఈ విషయం నాగార్జున దృష్టికి వెళ్లడంతో ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. అలా అభిమానిని కిందకు తోయడం తప్ప ఇలాంటివి జరగకుండా చూసుకుంటాను అంటూ ఆ అభిమానికి క్షమాపణలు చెప్పారు.

ఇలా తన బాడీగార్డ్స్ అభిమానిని తోయడంతో తాజాగా నాగార్జున తిరిగి ఎయిర్ పోర్ట్ కి వెళ్లి తనకోసం వచ్చిన అభిమానిని కలిశారు. అయితే ఆయన దివ్యాంగులు కావటం గమనార్హం. అదే ఎయిర్ పోర్ట్ లో ఆ అభిమానిని కలిసినటువంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వీడియో వైరల్ గా మారడంతో మొన్న తోసేసి, ఈ రోజు హక్కున్న చేర్చుకున్నారు అంటే ఆయన తన తప్పును తెలుసుకున్నారా.. లేక తనపై వచ్చిన విమర్శలను ఖండించడం కోసమే ఇలా చేశారా అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు

Read Moreఏపీ రాజకీయాలలోకి హైపర్ ఆది.. ఏకంగా ఆ పదవిలో?

ట్రెండింగ్ వార్తలు