రావణాసుర సెట్‌లో అడుగు పెట్టిన మాస్ మహారాజ ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా ఉందంటూ పోస్ట్‌

February 2, 2022

రావణాసుర సెట్‌లో అడుగు పెట్టిన మాస్ మహారాజ ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా ఉందంటూ పోస్ట్‌

Ravi Teja Joins Shoot Of Ravanasura: రామారావు ఆన్ డ్యూటీ షూటింగ్ ముగించేసుకుని నేటి నుండి `రావ‌ణాసుర` సెట్లో అడుగుపెట్టాడు ర‌వితేజ‌. స్వామిరారా త‌ర్వాత కేశ‌వ‌, దోచెయ్‌, ర‌ణ‌రంగం లాంటి ప్లాఫు చిత్రాల‌ను తెరకెక్కించిన సుధీర్ వర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందుతోంది. రవితేజ ఈ చిత్రంలో న్యాయవాదిగా కనిపించబోతోన్నారు. రామ్ పాత్రలో సుశాంత్ నటిస్తున్నారు.

ఫస్ట్ డే.. రావణాసుర.. ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంది.. అంటూ రవితేజ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో పాటు యూనిట్‌తో దిగిన ఫోటోను కూడా షేర్ చేశారు.

ఈ చిత్రంలో అను ఇమాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ మొత్తం ఐదుగురు హీరోయిన్లు న‌టిస్తున్నార‌ట‌. అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీం వర్క్స్ బ్యానర్లపై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Read More: ఎఫ్ 3 విష‌యంలో దిల్‌రాజు రిస్క్ చేయ‌డానికి అస‌లు కార‌ణం ఇదేనా? 

ట్రెండింగ్ వార్తలు