క్రేజీ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ.. ఆ రోజే సినిమాకి ముహూర్తం!

April 3, 2024

క్రేజీ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ.. ఆ రోజే సినిమాకి ముహూర్తం!

సైంధవ్ సినిమాతో మంచి హిట్ ని అందుకోలేకపోయిన వెంకటేష్ ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మళ్లీ మన ముందుకి వస్తున్నారు. వీరి కాంబినేషన్లో ఇంతకుముందు ఎఫ్2,ఎఫ్3 సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి భీమ్స్ సిసిరోలియో సంగీతం వహిస్తున్నట్లు సమాచారం. ఉగాది రోజున హైదరాబాదులో ఈ సినిమా ప్రారంభించబోతున్నట్లు సమాచారం.

త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా టైటిల్ ని కూడా ఆ పూజ ఈవెంట్ లోనే ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. హీరో వెంకటేష్ కి సంక్రాంతి సీజన్ బాగా కలిసి వచ్చింది. అందుకే ఈ సినిమాని 2025 సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారట. ప్రస్తుతం ఈ కాంబోకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

దీంతో వెంకటేష్ ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. సైన్ధవ్ సినిమాతో ఈ సంవత్సరం పండగకి ప్రేక్షకులకు ముందుకు వచ్చిన వెంకటేష్ అభిమానులని అలరించలేకపోయాడు. చాలా కాలం తర్వాత వెంకటేష్ యాక్షన్ మోడ్ లో కనిపించిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దాంతో మళ్ళీ ఎఫ్2, ఎఫ్3 వంటి సూపర్ హిట్ హాక్ కాంబోలో సినిమా చేయడమే కరెక్ట్ అని ఫిక్స్ అయ్యాడంట వెంకటేష్. అయితే ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకి సంక్రాంతి కి వస్తున్నాం అనే టైటిల్ ని మూవీ టీం ఫిక్స్ చేసినట్లు సమాచారం.

అయితే దీని గురించి కూడా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఉండే అవకాశం ఉంది. అనిల్ రావిపూడి బాలయ్యతో మంచి హిట్ ని కొట్టి మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇప్పుడు వెంకీ కి ఎలాంటి బ్రేక్ ఇస్తాడో వేచి చూడాలి. ఈ చిత్రం వెంకటేష్ కి 76వ సినిమా కావటం విశేషం.

Read More: ఇది పొగరు కాదు ఆత్మవిశ్వాసం.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్!

Related News

ట్రెండింగ్ వార్తలు