పిఠాపురం ఎమ్మెల్యే గారు అంటూ పవన్ పై ఆసక్తికర పోస్ట్ చేసిన వెంకీ..ట్వీట్ వైరల్!

June 6, 2024

పిఠాపురం ఎమ్మెల్యే గారు అంటూ పవన్ పై ఆసక్తికర పోస్ట్ చేసిన వెంకీ..ట్వీట్ వైరల్!

జనసేన అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలోనూ ఏపీ రాష్ట్ర రాజకీయాలలో మారు మోగుతుంది. ఈయన పొత్తులో భాగంగా ఈసారి ఇరవై ఒక్క చోట్ల పోటీ చేయగా 21 చోట్ల అధికమైన మెజారిటీని సొంతం చేసుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయక 70 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికలలో భారీ విజయం సాధించడంతో తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.. ఈ క్రమంలోనే సీనియర్ నటుడు వెంకటేష్ సైతం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా పవన్ గెలుపు పై వెంకటేష్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..కంగ్రాట్స్ డియర్ పవన్ కళ్యాణ్ ఇంతటి భారీ విజయం సాధించినందుకు. దీనికి నీకంటే అర్హులు ఎవరు లేరు. నువ్వు మరింత ఎత్తుకు ఎదిగి ప్రజలకు సేవ చేయాలనే మీ కృషి, శక్తి, అంకితభావం కొనసాగించాలి, అలాగే నీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను పిఠాపురం ఎమ్మెల్యే గారు అని పోస్ట్ చేసారు. అలాగే భారీ మెజారిటీతో విజయం సాధించిన చంద్రబాబు నాయుడుకి కూడా శుభాకాంక్షలు తెలిపారు.

ప్రస్తుతం ఈ ట్వీట్ ను సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే వెంకటేష్ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ పిఠాపురం ఎమ్మెల్యే గారు అంటూ పోస్ట్ చేయడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే వీరిద్దరూ కలిసి గోపాల గోపాల సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించిన సంగతి మనకు తెలిసిందే.

Read More: ఆ కండిషన్ కి ఒప్పుకుంటేనే ఎన్టీఆర్ తో సినిమా చేస్తా.. డైరెక్టర్ కి రష్మిక కండిషన్!

ట్రెండింగ్ వార్తలు