తెలుగులో కోటి రూపాయలు తీసుకున్న ఫస్ట్ హీరోయిన్..ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

July 22, 2024

తెలుగులో కోటి రూపాయలు తీసుకున్న ఫస్ట్ హీరోయిన్..ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

సినిమా ఇండస్ట్రీలో హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు రెమ్యూనరేషన్ చాలా తక్కువగా ఉంటుంది. హీరోలకు వందల కోట్ల రెమ్యూనరేషన్లు ఇవ్వగా హీరోయిన్లకు మాత్రం 10 కోట్లలోపే రెమ్యూనరేషన్ అందిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే గత 15 సంవత్సరాల క్రితమే హీరోయిన్ కోటి రూపాయల రెమ్యూనరేషన్ అందుకోవడం అంటే అది చాలా పెద్ద రెమ్యూనరేషన్ అని చెప్పాలి. ఇలా కోటి రూపాయలు అందుకున్న హీరోయిన్లలో దివంగత నటి శ్రీదేవి ఒకరు.

ఈమె బాలీవుడ్ సినిమాకి కోటి రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారు కానీ మన తెలుగు సినిమాలో కూడా కోటి రూపాయలు అందుకున్నటువంటి తొలి హీరోయిన్ ఇప్పుడు ఎలాంటి అవకాశాలు లేక సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తూ ఉన్నారు. మరి ఆ కోటి రూపాయలు అందుకున్న ఫస్ట్ హీరోయిన్ ఎవరు అనే విషయానికి వస్తే ఆమె మరెవరో కాదు మన పోకిరి భామ ఇలియానా.

రామ్ హీరోగా నటించిన దేవదాసు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న ఇలియానా అనంతరం పోకిరి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత ఈమెకు వరుసగా తెలుగు తమిళ భాష చిత్రాలలో అవకాశాలు వచ్చాయి. పోకిరి సినిమా మంచి హిట్ కావడంతో రవితేజ హీరోగా నటించిన ఖతర్నాక్ సినిమా కోసం ఈమెకు ఏకంగా నిర్మాతలు కోటి రూపాయలు ఆఫర్ చేసి ఈ సినిమాలో తీసుకున్నారు. అలా తెలుగు చిత్ర పరిశ్రమలో కోటి రూపాయలు అందుకున్న తొలి హీరోయిన్ గా ఇలియానా నిలిచారు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోలేదు.

ఇక ఈ సినిమా తర్వాత ఈమె మరింత రెమ్యూనరేషన్ కూడా పెంచినప్పటికీ ఈమె సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో తిరిగి తన రెమ్యూనరేషన్ తగ్గించుకున్నారు. ఇక ఇటీవల కాలంలో ఇలియానాకు సినిమా అవకాశాలు లేకపోవడంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తున్నారు. ఒక బాబుకి జన్మనిచ్చిన ఈమె తన బాబు ఆలనా పాలన చూసుకుంటూ విదేశాలలో ఉన్నారు

ట్రెండింగ్ వార్తలు