నాగచైతన్యకు తల్లిగా స్టార్ హీరోయిన్.. ఇదేం ట్విస్ట్ రా బాబు!

June 5, 2024

నాగచైతన్యకు తల్లిగా స్టార్ హీరోయిన్.. ఇదేం ట్విస్ట్ రా బాబు!

సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఎంతో మనుగడ ఉంటుంది కానీ హీరోయిన్లకు మాత్రం ఎక్కువ కాలం పాటు ఇండస్ట్రీలో మనుగడ ఉండదనే సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే స్టార్ హీరోల సరసన నటించినటువంటి ఎంతో మంది హీరోయిన్లు ఆ హీరోల కొడుకులకు తల్లి పాత్రలలో నటిస్తూ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. ఇలా ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు తల్లి పాత్రలకు కమిట్ అవుతూ సెకండ్ ఇన్నింగ్స్ వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు.

ఇక డైరెక్టర్లు సైతం చాలా విభిన్నమైనటువంటి కాంబినేషన్లో సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ క్రమంలోనే సౌత్ ఇండస్ట్రీలో దాదాపు పది సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగినటువంటి నటి జ్యోతికను సైతం తల్లి పాత్రలకు ఎంపిక చేస్తున్నారు. జ్యోతిక హీరోయిన్ గా సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈమె లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తున్నారు.

ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్యకు తల్లి పాత్రలో నటించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. నాగచైతన్య ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత విరూపాక్ష సినిమా డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయ్యారు.

ఈ సినిమాలో నాగచైతన్య సరసన తిరిగి పూజా హెగ్డే నటించబోతున్నారు అయితే ఈ సినిమాలో నాగచైతన్యకు తల్లి పాత్రలో నటి జ్యోతికను తీసుకోవాలని ఆలోచనలో డైరెక్టర్ ఉన్నట్టు సమాచారం. ఇదే విషయమై ఆమెతో చర్చించారని తెలుస్తోంది. ఇలా నాగచైతన్యకు తల్లి పాత్రలో జ్యోతిక నటిస్తున్నారంటూ వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read More: మా కుటుంబానికి ఎంతో గర్వకారణం.. బాబాయ్ గెలుపు పై చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ట్రెండింగ్ వార్తలు