సమంత లేటెస్ట్‌ వర్కౌట్‌ వీడియో చూశారా!

January 8, 2022

సమంత లేటెస్ట్‌ వర్కౌట్‌ వీడియో చూశారా!
SAMANTHA వర్కౌట్స్‌ విషయంలో హీరోయిన్‌ సమంత ఏ మాత్రం కాంప్రమైజ్‌ కారు. షూటింగ్‌ షెడ్యూల్స్‌తో బిజీగా ఉన్నప్పటికీని సరైన సమయంలో వర్కౌట్స్‌ చేస్తుంటారు. అలాగే ఆ వర్కౌట్స్‌ చెందిన ఫోటోలు, వీడియోలను సమంత సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తుంటారు. తాజాగా సమంత చేసిన వర్కౌట్‌ వీడియో వైరల్‌ అవుతోంది.ఇక సమంత ప్రస్తుతం యశోదతో పాటు తమిళంలో మరో లేడీ ఓరియంటెడ్‌ ఫిల్మ్‌ చేస్తున్నారు. ఇక ఫ్యామిలీమ్యాన్‌ 2 తర్వాత రాజ్‌ అండ్‌ డీకేలతో సమంత మరో వెబ్‌సిరీస్‌ చేయనున్నారని, ఇందులో వరుణ్‌ ధావన్‌ లీడ్‌ హీరోగా కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు సమంత చేసిన మైథలాజికల్‌ ఫిల్మ్‌ ‘శాకుంతలం’ విడుదలకు సిద్ధమైంది. గుణశేకర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉంది.  

ట్రెండింగ్ వార్తలు