ఐలవ్‌యూ చెప్పిన శ్రుతీహాసన్‌…ఇదిగో సాక్ష్యం!

January 10, 2022

ఐలవ్‌యూ చెప్పిన శ్రుతీహాసన్‌…ఇదిగో సాక్ష్యం!

Shruti Haasan: యస్‌..హీరోయిన్‌ శ్రుతీహాసన్‌ తన ప్రేమను ఒప్పుకున్నారు. శాంతను హజారికాతో శ్రుతీహాసన్‌ డేటింగ్‌లో ఉన్నారని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా తన లవ్‌ ను ఓ వీడియో ద్వారా కన్ఫార్మ్‌ చేశారు శ్రుతీహాసన్‌. ‘మీ రిలేషన్‌ షిప్‌లో ముందుగా ఎవరు ప్రపోజ్‌ చేశారు ?’ అన్న వాయిస్‌కు శ్రుతీ హాసన్‌ సైగలతో నేనే ఐలవ్‌యూ అని ప్రపోజ్‌ చేశాను అంటూ చెప్పకనే చెప్పారు. ఇన్‌స్ట్రాగ్రామ్‌ వీడియోలో శ్రుతీ చెప్పిన ఈ మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఇక ఇదే వీడియోకు గుడ్‌ టు సీయూ..అంటు శ్రుతీహాసన్‌ సిస్టర్‌ అక్షరాహాసన్‌ కామెంట్‌ చేయడం మరో విశేషం. ఇక ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా నటించనున్న సినిమాలో హీరోయిన్‌గా శ్రుతీహాసన్‌ చేయనున్నారు. అలాగే చిరంజీవి హీరోగా నటించే చిత్రంలోనూ శ్రుతీయే హీరోయిన్‌ అన్న వార్తలు వస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు