ఏపీ రాజకీయాలలోకి హైపర్ ఆది.. ఏకంగా ఆ పదవిలో?

June 28, 2024

ఏపీ రాజకీయాలలోకి హైపర్ ఆది.. ఏకంగా ఆ పదవిలో?

బుల్లితెర కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు హైపర్ ఆది. ఈయన కెరియర్ మొదట్లో కమెడియన్ గా కొనసాగుతూ ఉండేవారు అనంతరం టీం లీడర్ గా మారిపోయి తన కామెడీ పంచ్ డైలాగుల ద్వారా ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేసేవారు. ఇక ప్రస్తుతం ఒకవైపు బుల్లితెర కార్యక్రమాలతో పాటు మరోవైపు సినిమా అవకాశాలను కూడా అందుకుంటూ బిజీగా ఉన్నారు.

ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న ఈయన మెగా ఫ్యామిలీకి వీరాభిమాని అనే సంగతి మనకు తెలిసిందే .ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పర్యటన చేయడమే కాకుండా జనసేన పార్టీ విజయానికి ఎంతో కీలకంగా మారారు.

ఇక పవన్ కళ్యాణ్ గురించి ఎవరైనా విమర్శలు చేస్తే వారికి తనదైన శైలిలోనే కౌంటర్ ఇస్తూ ఉంటారు. ఇలా రాజకీయాల పరంగా కూడా మంచి గ్రిప్ ఉన్నటువంటి ఆది గతంలో తనకు జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తే తప్పకుండా పోటీ చేస్తానని తెలిపారు. అయితే త్వరలోనే ఈయన రాజకీయాల్లోకి కూడా రాబోతున్నారని తెలుస్తోంది.

జనసేన పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి హైపర్ ఆది అధికారకంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం అంతేకాకుండా ఈయనకు జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్సీ పదవిని కూడా ఇవ్వబోతున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇలా హైపర్ ఆది గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈయన పలు బుల్లి తెర కార్యక్రమాలతో పాటు సినిమాలలో కూడా కమెడియన్ గా కొనసాగుతూ కెరియర్ పట్ల బిజీగా ఉన్నారు

Read MoreKalki2898AD Twitte Review: ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఓకే..కానీ సాధార‌ణ ప్రేక్ష‌కుల రియాక్ష‌న్ ఏంటి?

Related News

ట్రెండింగ్ వార్తలు