ఈ నా కొడుకులు ఇక మారరు.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హైపర్ ఆది!

July 3, 2024

ఈ నా కొడుకులు ఇక మారరు.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హైపర్ ఆది!

హైపర్ ఆది ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తలలో నిలుస్తున్నారు. జబర్దస్త్ కమెడియన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఇలా ఈ కార్యక్రమానికి దూరమైన బుల్లితెరపై ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షో తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కూడా ఈయన పాల్గొంటే సందడి చేస్తున్నారు. మరోవైపు సినిమా అవకాశాలను కూడా అందుకొని కెరియర్ పట్ల బిజీగా ఉన్నారు.

ఈ విధంగా వరుస బుల్లితెర కార్యక్రమాలలో ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి హైపర్ ఆది ఇటీవల కాలంలో ఏపీ రాజకీయాలను ఉద్దేశిస్తూ పరోక్షంగా చేస్తున్న కామెంట్లు కూడా సంచలనగా మారాయి. ఈ క్రమంలోనే ఈయన తరచూ విమర్శలను కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ విజయానికి హైపర్ ఆది ఎంతో దోహదపడ్డారనే సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఆది తన కామెడీ స్కిట్లలో కూడా పవన్ పేరును ఉపయోగించడం అలాగే వైసిపి ప్రభుత్వం పట్ల సెటైర్లు వేస్తూ స్కిట్లు చేస్తూ ఉంటారు.

ఇలా ఈయన చేసే స్కిట్ పలు సందర్భాలలో విమర్శలకు కూడా గురి అవుతుంది. అయితే తాజాగా మరోసారి ఈయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు. ప్రతి బుధవారం ఈటీవీలో ప్రసారం కాబోయే డాన్స్ షోకి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో భాగంగా కంటెస్టెంట్ డాన్స్ చేసిన తర్వాత వాళ్ళ పర్ఫామెన్స్ తో పాటు ఆమె కొరియోగ్రాఫర్ ని కూడా మెచ్చుకున్నారు జడ్జెస్. ఆ తర్వాత ఆది ఇక నువ్వే చూసుకోవాలి అంటూ శేఖర్ మాస్టర్ కామెంట్ చేశారు.

శేఖర్ మాస్టర్ నువ్వే చూసుకోవాలి అని చెప్పడమే ఆలస్యం అది స్పందిస్తూ..ఆది అదలా ఉంచండి.. ఒకడేమో సెట్ల మీద సెట్లు వేస్తాడు,వంద మందిని తీసుకొచ్చి డ్యాన్స్ వేయిస్తాడు.. ఇంకొకడు ఇంకేదో చేస్తాడు… ఈ నా కొడుకులు ఇక మారరు అంటూ ఫన్నీగా పంచ్ వేశారు హైపర్ ఆది. ఈయన సరదాగే మాట్లాడినప్పటికీ కొంతమంది మాత్రం ఈయన మాట తీరుపై విమర్శలు కురిపిస్తున్నారు

Related News

ట్రెండింగ్ వార్తలు