చిరంజీవికి కంఫర్టబుల్ హీరోయిన్ ఆమెనా.. ఎందుకంత స్పెషల్ అంటే?

June 15, 2024

చిరంజీవికి కంఫర్టబుల్ హీరోయిన్ ఆమెనా.. ఎందుకంత స్పెషల్ అంటే?

మెగాస్టార్ చిరంజీవి ఒకానొక సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో సక్సెస్ అందుకున్నారు ఈయన ఒకప్పుడు వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎన్నో అవార్డులను రివార్డులను అందుకున్నారు.

ఇక చిరంజీవి ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోయిన్లతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇక చిరంజీవితో నటించాలి అంటే హీరోయిన్లకు కంగారు ఉంటుందని చెప్పాలి. ఆయనలా డాన్స్ చేయడం అంటే హీరోయిన్లకు కత్తి మీద సామూలాంటిదే. అందుకే చిరంజీవితో నటించే హీరోయిన్లు డాన్స్ విషయంలో ఎంతో కంగారు పడుతూ ఉంటారు. డాన్స్ విషయంలో ఈయనకు గట్టి పోటీ ఇవ్వడం కోసం హీరోయిన్లు కూడా తెగ కష్టపడుతూ ఉంటారు.

అయితే గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చిరంజీవికి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోయిన్లతో నటించారు. మీకు బాగా కంఫర్ట్ అనిపించిన హీరోయిన్ ఎవరు అంటూ ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు చిరంజీవి సమాధానం చెబుతూ నేను ఒక సినిమాలో నటిస్తున్నాను అంటే హీరోయిన్లతో నా కంఫర్ట్ చూసుకోనని ఈయన తెలియజేశారు.

ఎప్పుడూ కూడా నేను వ్యక్తిగతంగా హీరోయిన్ల విషయంలో నా కంఫర్ట్ వెతుక్కోనని, ఆ సినిమాకి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇద్దరం కలిసి ఎలా చేస్తే మంచి ఔట్‌పుట్‌ వస్తుందనే దానిపైనే నా ఫోకస్‌ ఉంటుందని తెలిపారు. ఆ ప్రకారంగా తనకు బాగా అనిపించిన హీరోయిన్‌ రాధ అని వెల్లడించారు చిరు. ఆమె డాన్స్ చేసే సమయంలో బాగా ఎంజాయ్‌ చేస్తుందని, ఎక్స్ ప్రెషన్స్, మూమెంట్స్ చాలా ఈజ్‌తో ఇస్తుందని, ఆ స్టెప్పులు ఎంజాయ్‌ చేస్తూ చేయడం వల్ల ఆ భావం ఆడియెన్స్ బాగా రీచ్ అవుతుందని తెలిపారు. ఇక రాధ కాకుండా మిగిలిన ఎవరూ తనతో డాన్స్ చేసిన చాలా కష్టపడుతూ చేస్తుంటారని చిరంజీవి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read More: బాలకృష్ణ ,నాగార్జున, వెంకటేష్ హీరోలని నాకు తెలీదు.. నిహారిక సంచలన వ్యాఖ్యలు!

ట్రెండింగ్ వార్తలు