సినిమా ఏదైనా ఆ పని మాత్రం అస్సలు చెయ్యను.. జాన్వీ కపూర్

August 5, 2024

సినిమా ఏదైనా ఆ పని మాత్రం అస్సలు చెయ్యను.. జాన్వీ కపూర్

దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటి జాన్వీ కపూర్. ఈమె ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో పాటు టాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. తెలుగులో ఎన్టీఆర్ సరసన దేవర సినిమా ద్వారా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా మొదటిసారి ఈమె తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమాతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమాలో కూడా ఈమె హీరోయిన్గా నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఇక ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కనుంది. ఇలా వరుస పాన్ ఇండియా సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్న ఈమె ఇటీవల ఓ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా జాన్వీ కపూర్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. సినిమాలో నా పాత్ర కోసం నేను ఎంత కష్టమైనా పడతాను. కానీ ఒక పని మాత్రం అస్సలు చేయనని చెప్పుకు వచ్చారు. సినిమా కోసం ఎంత పని చెప్పినా చేస్తాను కానీ నా జుట్టు కత్తిరించమంటే మాత్రం అసలు ఒప్పుకోనని తెలిపారు. ఆ సినిమాలోని నా పాత్ర నా కెరియర్ ని మలుపు తిప్పే పాత్ర అయినప్పటికీ నేను మాత్రం జుట్టు కత్తిరించను.

నా పాత్రకు జుట్టు కత్తిరించడమే అవసరమనుకుంటే దానిని విఎఫ్ఎక్స్ లో మేనేజ్ చేస్తామంటే ఆ సినిమాలో నటిస్తాను లేకుంటే సినిమా నుంచి తప్పుకుంటాను కానీ జుట్టును మాత్రం కత్తిరించే ప్రసక్తే లేదని తెలిపారు. ఎందుకంటే తన జుట్టు అంటే తన తల్లి శ్రీదేవికి చాలా ఇష్టమని, ధడక్ సినిమా కోసం నేను జుట్టు కత్తిరించడంతో అమ్మ ఆరోజు బాగా తిట్టింది ఎలాంటి పాత్ర అయినా జుట్టు మాత్రం కత్తిరించొద్దు అంటు నాకు చెప్పారు.. అందుకే తాను జుట్టు మాత్రం కత్తిరించనని జాన్వీ వెల్లడించారు

ట్రెండింగ్ వార్తలు