April 12, 2024
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్వరలోనే పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అల్లు అర్జున్ త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా రాబోతున్నటువంటి పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ఆగస్టు 15వ తేదీ ఈ సినిమా విడుదల కానున్న తరుణంలో సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విడుదల చేస్తూ ఉన్నారు. ఇటీవల అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి టీజర్ వీడియో విడుదల చేయగా ఈ టీజర్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో అల్లు అర్జున్ గంగమ్మ జాతరకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను విడుదల చేశారు ఇందులో భాగంగా అల్లు అర్జున్ చీర కట్టుకొని సాక్షాత్తు అమ్మవారు నడిచి వచ్చిన విధంగా రావడం హైలెట్ అయిందని చెప్పాలి.
ఇకపోతే ఈ యాక్షన్ సీక్వెన్స్ లో భాగంగా అల్లు అర్జున్ చీర కట్టుకోవడంతో ఆయనకు ఫైట్ సన్నివేశాలలో నటించడానికి చాలా కష్టతరంగా మారిందని తెలుస్తుంది. సాధారణంగా చీర కట్టుకుంటేనే నడవడం ఇబ్బందిగా ఉంటుంది అలాంటిదే ఎలాంటి అలవాటు లేకుండా చీరకట్టుకొని యాక్షన్ సన్ని వేషాలలో నటించాలి అంటే చాలా ఇబ్బందిగా మారిందని తెలుస్తుంది.
ఇలాంటి సన్నివేశం చేసేటప్పుడు హావభావాలు కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఈ సన్నివేశం చాలా పర్ఫెక్ట్ గా రావడం కోసం చాలా కష్టపడ్డారని ఈ యాక్షన్ సీక్వెన్స్ చేయడానికి ఈయన ఏకంగా 51 టేక్స్ తీసుకున్నారంటూ ఈ వార్త సోషల్ మీడియాలో ఇలా పర్ఫెక్షన్ కోసం అల్లు అర్జున్ ఎంత కష్టమైనా భారిస్తారు అనడానికి ఇదే నిదర్శనం అని చెప్పాలి.
https://telugu.chitraseema.org/bigg-boss-telugu-8-will-release-earlier-than-expected/